పలు అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే కరాటే కళ్యాణి తాజాగా గద్దర్ ని ఉద్దేశిస్తూ కాంట్రవర్సల్ పోస్ట్ పెట్టింది. దీంతో ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా యుద్ద నౌక గద్దర్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన నిన్న(ఆదివారం) చికిత్స పొందుతు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. తన ఆటపాటలతో ప్రజలను చైతన్యవంతుల్ని చేసి ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని తన పాటలతో ఉర్రూతలూగించారు గద్దర్. కాగా ఈ రోజు అల్వాల్ లోని మహాబోధి స్కూల్ ప్రాంగణంలో అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరిగాయి. అశేషమైన అభిమానులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. నటి కరాటే కళ్యాణి గద్దర్ ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్ పెట్టింది. గద్దర్ పాటలు, ఆయన కొడుకుపైన కరాటే కళ్యాణి కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసింది. దీంతో గద్దర్ అభిమానులు, ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పీపీడిత ప్రజలకు అండగా తన గళాన్ని వినిపించిన గద్దర్ పై బిగ్ బాస్ ఫేం కరాటే కళ్యాణి వివాదాస్పదస్పదమైన పోస్ట్ పెట్టింది. ‘బాలు గారు విశ్వనాథ్ గారు సిరివెన్నెల గారు వెళ్లిపోయిన రోజున ఎర్ర బ్యాచ్ ఏమన్నారు మర్చిపోలేదు కానీ పోయినోల్లని తిట్టే సంస్కారం మా ధర్మం లో లే’ అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో గద్దర్ అభిమానులు కరాటే కళ్యాణిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నువ్వొక అవుట్ డేటెడ్ పీస్ వి పబ్లిసిటీ కోసమే తప్ప నీకు వేరే వ్యాపకం లేదని కొందరు, గద్దర్ ని ఏమైనా అంటే ఇక్కడ తిరగలేవు అంటూ మరి కొందరు ఫైర్ అవుతున్నారు. కుక్కతోక వంకర అన్నట్లు నీ వక్ర బుద్ది చూపించుకుంటున్నావ్ అని దుమ్మెత్తిపోస్తున్నారు. చనిపోయిన వ్యక్తి పట్ల ఈ విధంగా పోస్ట్ పెడతావా అంటూ తిట్టిపోస్తున్నారు.