కొన్నిసార్లు సినిమాలలో జరిగేవి రియల్ లైఫ్ లో కూడా యాదృచ్చికంగా జరుగుతుంటాయి. ప్రస్తుతం పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ కి, జనసేన ఎన్నికల ప్రచార వాహనం వారాహి నెంబర్ కి సంబంధించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. వారాహి పవన్ కళ్యాణ్ ప్రచార రథం అనే సంగతి అందరికి తెలిసిందే. ఓవైపు రాజకీయ వివాదం జరుగుతుండగా.. మరోవైపు వారాహి రిజిస్ట్రేషన్ నెంబర్ పై జోరుగా చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వారాహి నెంబర్ కి, పుష్పరాజ్ ఫోన్ నెంబర్ కి లింక్ చేశారు నెటిజన్స్. మరి అసలు వారాహి విషయంలో పుష్పరాజ్ ఎందుకొచ్చాడు? అసలు ఏం జరిగిందో చూద్దాం!
వివరాల్లోకి వెళ్తే.. వారాహి వాహనం రిజిస్ట్రేషన్ చెల్లదని వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించిన విషయం విదితమే. ఈ వివాదం కొనసాగుతుండగా తెలంగాణ రవాణా శాఖ వారాహికి రిజిస్ట్రేషన్ పర్మిషన్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. అంతేగాక వారాహికి ‘TS 13 EX 8384’ అనే రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ప్రకటించింది. అలాగే వారాహి కలర్ ఆర్మీ వాళ్ళు వాడేది కాదని.. ఎమరాల్డ్ గ్రీన్ అని తెలంగాణ ఆర్టీఏ వివరణ ఇచ్చింది. ఈ క్రమంలో వారాహి రిజిస్ట్రేషన్ నెంబర్ కు సంబంధించి నెట్టింట ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. మరి ఆ వీడియోలో ఏముంది అనంటే.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఫోన్ నంబర్ చివరి నాలుగు అంకెలు, వారాహి నెంబర్ ఒకటే అని వీడియో వైరల్ అవుతోంది. మరి పుష్పరాజ్ ఫోన్ నెంబర్, వారాహి నెంబర్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.
8384 🔥🔥@Pawankalyan’s ‘Varahi’ vehicle registration number & @alluarjun’s phone number in Pushpa are same 😅 pic.twitter.com/yRrBcd9dpI
— ★彡 𝙽𝚊𝚟𝚎𝚎𝚗 𝙹𝚂𝙿 🦅彡★ (@_jspnaveen) December 13, 2022