పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన 10వ ఆవిర్భావ సభకు వారాహి మీద వెళ్తుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పవన్ రియాక్షన్ చూసిన జనాలు.. ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు..
జనసేన పార్టీ 2014 మార్చి 14న ఆవిర్భవించింది. నేటితో తొమ్మిదేళ్లు పూర్తైన సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో ఆవిర్భావ సభను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆయన వారాహి వాహనం మీద భారీ ర్యాలీగా మచిలీపట్నం బయలుదేరారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వారాహి పేరిట బస్సు యాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర విషయంలో ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. పవన్ వారాహి యాత్ర ఆగిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి, నిజంగా పవన్ కల్యాణ్ బస్సు యాత్ర ఆగిపోయిందా? అసలు ఏమైంది?
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం వారాహిని సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పవన్ అభిమాని ఒకరు జనసేన ప్రచారం కోసం వారిహి పేరుతో సైకిళ్లను తీసుకొచ్చాడు. వీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం మార్కెట్‌లో వారాహి సైకిళ్లు హల్చల్ చేస్తున్నాయి. ఎక్కడంటే
జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 2024 ఎన్నికల కోసం పగడ్బంధీగా సిద్ధం అవుతున్నారు. వచ్చే ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం చేయటానికి వారాహి అనే వాహనాన్ని రంగంలోకి దింపారు. వారాహి వాహనంపైనే పవన్ కల్యాణ్ ఏపీలో ప్రచారం చేయనున్నారు. ఇక, వారాహి వాహనానికి మంగళవారం కొండగట్టులో ప్రత్యేక పూజలు జరిగిన సంగతి తెలిసిందే. కొండగట్టులో పూజల అనంతరం వారాహి వాహనం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించటానికి పవన్ కల్యాణ్ […]
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారం వాహనం వారహికి ప్రత్యేక పూజలు చేసేందుకు.. కొండగట్టు ఆలయానికి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పవన్ తెలంగాణ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. పవన్ కాన్వాయ్‌ను ఫాలో అయిన యువకులు కొందరు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ యాక్సిడెంట్‌లో ఓ యువకుడి మృతి చెందగా.. మరో ముగ్గురురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయించేందుకు కొండగట్టు వచ్చిన పవన్ కళ్యాణ్.. పూజ కార్యక్రమాలు […]
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేడు కొండగట్టులో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం వాడనున్న ప్రచార రథం ‘‘వారాహి’’కి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. పవన్ కల్యాణ్ ఇప్పటికే హైదరాబాద్ నుంచి కొండగట్టుకు బయలుదేరారు. జనసేన నేతలు, కార్యకర్తలతో కలిసి కాన్వాయ్‌తో వెళ్లారు. అయితే, ఆయన ప్రయాణిస్తున్న వాహనం భారీ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. హకీంపేట్ వద్ద లారీ రిపేర్ జరుగుతుండటంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పవన్ […]
ప్రముఖ స్టార్ హీరో, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 24న ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. ఏపీలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న వాహనం ‘వారాహి’కి కొండగట్టులో ప్రత్యేక పూజలు చేయించనున్నారు. కొండగట్టు నుంచే వారాహి వాహనం ప్రారంభం కానుంది. అనంతరం ధర్మపురి క్షేత్రాన్ని కూడా ఆయన దర్శించనున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని జనసేన కీలక నేతలతో ఆయన సమావేశం అవ్వనున్నారు. ఈ మేరకు జనసేన […]
జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు పాలిటిక్స్ లో, మరోవైపు సినిమాలలో యాక్టీవ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎన్నికల ప్రచారం కోసం వారాహి అనే వాహనాన్ని తయారు చేయించుకున్నారు పవన్. అయితే.. పవన్ ప్రచార వాహనం అయినటువంటి వారాహికి తెలంగాణ రవాణాశాఖ పర్మిషన్ ఇచ్చింది. అయితే తాజాగా మరికొన్ని వాహనాలకు రిజిస్ట్రేషన్ కోసం పవన్ కల్యాణ్ ఆర్డీఏ కార్యాలయానికి వెళ్లారు. జనసేనకు సంబంధించిన వాహనాల రిజిస్ట్రేషన్ కోసం పవన్ ఖైరతాబాద్ […]
కొన్నిసార్లు సినిమాలలో జరిగేవి రియల్ లైఫ్ లో కూడా యాదృచ్చికంగా జరుగుతుంటాయి. ప్రస్తుతం పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ కి, జనసేన ఎన్నికల ప్రచార వాహనం వారాహి నెంబర్ కి సంబంధించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. వారాహి పవన్ కళ్యాణ్ ప్రచార రథం అనే సంగతి అందరికి తెలిసిందే. ఓవైపు రాజకీయ వివాదం జరుగుతుండగా.. మరోవైపు వారాహి రిజిస్ట్రేషన్ నెంబర్ పై జోరుగా చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వారాహి నెంబర్ కి, పుష్పరాజ్ […]