ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ చిత్రంలో మొదటిసారి ఊర మాస్ పాత్రలో అలరించాడు బన్నీ. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా, సమంత స్పెషల్ సాంగ్ లో నర్తించింది. పాన్‌ఇండియా మూవీగా రిలీజైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సాధించింది.
ఈ సినిమా ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించింది. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్ బన్నీ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. క్రికెటర్లు, సినిమా తారలు సైతం వీటిని రీక్రియేట్, స్పూఫ్స్, కవర్ సాంగ్ లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. పుష్ప చిత్రంలోని “శ్రీవల్లీ” సాంగ్ అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంది. యూట్యూబ్ లో సైతం ఈ పాట రికార్డు స్థాయిలో వ్యూస్ సంపాందించింది. ముఖ్యంగా ఇందులో అల్లు అర్జున్ వేసిన స్టెప్ అందరిని ఆకర్షిస్తుంది.
తాజాగా షాదాబ్ అలీ ఖాన్ అనే ఓ నెటిజన్ ఏడుస్తున్న పాపను జోకొట్టడానికి శ్రీవల్లీ సాంగ్ స్టెప్పులేశాడు. దీంతో ఆ పాప ఏడుపు ఆపింది. ఈ మొత్తాన్ని వీడియో రికార్డు చేశాడు. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ.. “పాప ఏడుపు లంకించుకున్నప్పుడు తనను హ్యాపీ చేయడానికి శ్రీవల్లి పర్ ఫెక్ట్ స్టెప్. మీరు కూడా మీ పాపాయిలతో ఈ స్టెప్ మూమెంట్ ను ట్రై చేయండి” అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ నెట్టింట్లో వైరల్ గా మారింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.