గతంలో కొత్త దుస్తులు కొనాలన్నా, ధరించాలన్నా పండుగలు, పుట్టిన రోజులు రావాల్సిందే. ఏడాది మొత్తంలో ఆరు జతల బట్టలు కూడా కొనేవారు కాదూ. కానీ ఇప్పుడు పరిస్థితులు దీనికి పూర్తిగా భిన్నం. నెలలోనే రెండు మూడు జతల బట్టలు కొనుగోలు చేస్తున్నారు. ఫ్లిప్ కార్ట్, అమెజాన్, మీ షో వంటి ఈ కామర్స్ సంస్థలు, ముగింట్లోకి డెలివరీ వంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాక.. వీటి కొనుగోలు మరింత తేలికగా మారింది. ట్రెండ్ కూడా ఎప్పటికప్పుడూ మారిపోతుండటంతో వాటిని కొనేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా నటీ నటులు ప్రభావం వీరిపై ఎలాగూ ఉండనుంది.
దుస్తులు ధరించి.. ఈ షాప్ లో కొనుగోలు చేయండి, ఈ యాప్ లో చవక అంటూ ఊదరగొట్టే ప్రచారాలు చేయడంతో పాటు నటీనటులు వాటిని ధరించడంతో మనం కూడా వారికి అనుసరిస్తుంటాం. అయితే ఫ్యాషన్ డిజైనర్ల కాస్ట్యూమ్స్ ను కొంత మంది నటీనటులు ప్రమోట్ చేస్తుంటారు. మరి కొంత మంది వార్తల్లో నిలిచేందుకు స్వంతంగా తమ దుస్తులను మేకోవర్ చేయిస్తుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటుందీ బాలీవుడ్ నటి, మోడల్ ఉర్ఫీ జావేద్. వెరైటీ దుస్తులు ధరించి కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. ప్రతి రోజూ ఏదో ఒక బోల్డ్ లుక్ లో దర్శనమిస్తుంటుంది. తన డ్రెసింగ్ స్టైల్స్ పై ఎన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చినా ఆమె వెనక్కు తగ్గదు. తాజాగా మరో డ్రెస్‌తో బయట కనిపించడంతో కెమెరా కళ్లు క్లిక్ మనిపించాయి. ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
బ్యాంగిల్స్, పిన్స్, సెల్ ఫోన్, వాచీలు కాదేదీ ఆమె కాస్ట్యూమ్స్‌కు అనర్హం. తాజాగా ఆమె మరో కొత్త అవతారంలో కనిపించింది. డెనిమ్ జీన్స్ ఫ్యాంట్ ను టాప్‌గా ధరించి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. తన జీన్స్‌కి క్రియేటివ్ టచ్ ఇచ్చి.. దాన్ని టాప్‌గా మలచింది. వాటిని ధరించి జూహులోని ఓ రెస్టారెంట్‌కు రావడంతో.. కెమెరాలకు పని చెప్పినట్లయింది. హిందీ బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొన్న తర్వాతే ఉర్ఫీ జావేద్‌కు ఫేమ్ వచ్చింది. ఇటీవల హై హై యే మజ్పూరి అనే సాంగ్ లో హాట్ లుక్ లో కనిపించింది. ఫుల్ గ్లామర్ షో చేయడంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ప్రస్తుతం ఉర్ఫీ రియాలిటీ సిరిస్ స్పిట్ విల్లా సీజన్ 14లో పాల్గొంటున్నారు.