‘జబర్దస్త్’లో వన్ ఆఫ్ ది టీమ్ లీడర్ గా చేస్తున్న రాకింగ్ రాకేష్.. గత కొన్నేళ్ల నుంచి ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తూ ఉన్నారు. కొన్ని నెలల క్రితం నుంచి అతడి టీంలో సుజాత కూడా చేస్తూ ఉంది. స్కిట్ లో జోడీగా చేసిన వీళ్లు.. రియల్ లైఫ్ లోనూ జంటగా మారేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని రాకేష్ పలు ఇంటర్వ్యూల్లో స్వయంగా చెప్పాడు. ఈ క్రమంలోనే షోలో మాత్రమే కాకుండా బయటకూడా జంటగానే కనిపిస్తున్నారు. తాజాగా సుజాత బర్త్ డే వేడుకల్ని దుబాయిలో సెలబ్రేట్ చేసుకున్నారు. అందులో రాకేష్ తెగ సందడి చేశాడు.
ఇక విషయానికొస్తే.. వెంట్రిలాక్విజం ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన రాకేష్, ‘జబర్దస్త్’లో వచ్చిన తర్వాత ఇక్కడే సెటిలైపోయాడు. గత కొన్నేళ్ల నుంచి టీమ్ లీడర్ గా చేస్తూ వస్తున్నాడు. మరోవైపు న్యూస్ రీడర్ గా పేరు తెచ్చుకున్న సుజాత.. బిగ్ బాస్ నాలుగో సీజన్ లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా పాల్గొని ఆకట్టుకుంది. ఆ తర్వాత రాకేష్ తో పరిచయమైనట్లు తెలుస్తోంది. సుజాత సొంతం యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుంది. అందులో ఎక్కువగా రాకేష్ కనిపిస్తూ ఉండేవాడు. అలా మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారింది.
కొన్నాళ్ల ముందు ఇరు కుటుంబసభ్యులు ఒప్పుకొన్నట్లు కనిపిస్తుంది. అందుకే పెళ్లి గురించి హింట్స్ ఇస్తూ వస్తున్నారు. అలానే ఈ మధ్య కాలంలో సుజాత-రాకేష్ కలిసి టూర్స్ కూడా వేస్తున్నారు. కొన్నిరోజుల ముందు దుబాయి వెళ్లిన ఈ జంట.. అక్కడి ఫొటోలను షేర్ చేసింది. సుజాత బర్త్ డే సెలబ్రేషన్స్ ని గ్రాండ్ చేసుకున్న రాకేష్.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. కొన్ని ఫొటోల్ని కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి. ఇందులో సుజాత-రాకేష్ సందడి చేస్తూ కనిపించారు. మరి రాకేష్-సుజాత జోడీ సెలబ్రేషన్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.