కొత్త సంవత్సరం.. పైగా కళ్ల ముందు సెలబ్రిటీలు. అభిమానులు ఊరుకుంటారా? సర్ ఒక్క సెల్ఫీ.. మేడం ఒక్క సెల్ఫీ అంటూ.. మీదకు ఎగబడుతుంటారు. దాంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి కూడా. ఇలాంటి సంఘటనలు ఇండస్ట్రీలో కోకొల్లలుగా జరిగాయి కూడా. తాజాగా న్యూ ఇయర్ వేడుకల్లో ఫ్యాన్స్ అత్యుత్సాహాం ప్రదర్శించడంతో బుల్లితెర నటుడి కాలికి గాయాలు అయ్యాయి. ఈ వేడుకలో తన భార్యతో కలిసి హాజరయ్యడు ఆ నటుడు. ఒక్కసారిగా ఫ్యాన్స్ ఫోటోల కోసం దూసుకురావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
సాధరణంగా సెలబ్రిటీలు మన కళ్ల ముందు ఉంటే వారితో ఒక్క ఫోటోనైనా తీసుకోవాలని అనుకుంటాం. ఇలాంటి సమయంలో ఫ్యాన్స్ నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది సెలబ్రిటీలు. తాజాగా జరిగిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఫోటోలకోసం ఎగబడటంతో బాలీవుడ్ బుల్లితెర జంట గుర్మీత్ చౌదరి-దెబీనా బెనర్జీ లు తెగ ఇబ్బంది పడ్డారు. అభిమానులు ఒక్కసారిగా సెల్ఫీల కోసం ఎగబడటంతో గుర్మీత్ కాలుకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఫ్యాన్స్ ను ఆపలేక గుర్మీత్ చాలా కష్టపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే నెటిజన్లు వీడియోపై పలు రకాలుగా స్పందిస్తున్నారు. భార్యను రక్షించేందుకు మీరు పడ్డ కష్టానికి సెల్యూట్ సర్ అని కొందరు కామెంట్ చేస్తే.. చాలా పెద్ద దెబ్బలు తాకాయి, వెంటనే అంబులెన్స్ కు కాల్ చేయండి అంటూ మరికొందరు రాసుకొచ్చారు. ఇక గుర్మీత్-దెబీనా 2008లో పాపులర్ అయిన రామాయణ్ సీరియల్ లో రాముడు, సీతగా కలిసి నటించారు. దాంతో వారి పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. 2011లో వీరు పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు బాలీవుడ్ లో యమ క్రేజ్ ఉంది. దాంతోనే వారు ఎక్కడ కనపడితే అక్కడ ఫ్యాన్స్ ఫోటోల కోసం ఎగబడుతుంటారు.