సినీ రంగంలో హీరోయిన్‌గా కొనసాగాలని, టాలెంటెడ్ యాక్ట్రెస్‌గా ప్రూవ్ చేసుకోవాలని కలలు కంటూ, ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే కథానాయికలు టాప్ ప్లేస్‌కి రావాలంటే ఒక్క హిట్ చాలు. అలాగే ఫేడౌట్ అవడానికి పలు కారణాలుంటాయి.
సినీ రంగంలో హీరోయిన్‌గా కొనసాగాలని, టాలెంటెడ్ యాక్ట్రెస్‌గా ప్రూవ్ చేసుకోవాలని కలలు కంటూ, ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే కథానాయికలు టాప్ ప్లేస్‌కి రావాలంటే ఒక్క హిట్ చాలు. అలాగే ఫేడౌట్ అవడానికి పలు కారణాలుంటాయి. గ్లామర్, టాలెంట్ ఉండి కూడా సరైన ఆఫర్స్ రాకపోవడంతో సినిమాలకు దూరమై, పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయిపోయిన భామలు చాలా మందే ఉన్నారు. దాదాపు సౌత్, నార్త్ వాళ్లు కూడా ఆఫ్టర్ మ్యారేజ్ విదేశాల్లో సెటిలైపోయారు. చూడ చక్కని రూపంతో, మంచి నటనతో ఆకట్టుకున్న ఓ భామ కూడా సరైన అవకాశాలు లేక పరిశ్రమకు దూరమైంది. ఆమె ఎవరో కాదు.. నటి డెబీనా బెనర్జీ. పేరు చెప్తే, ఫోటో చూస్తే అంత త్వరగా గుర్తు పట్టకపోవచ్చు కానీ తను తెలుగులోనూ నటించిందని తెలిస్తే.. ఎవరబ్బా? అని ఆరా తియ్యడం పక్కా.
కలకత్తాలోని వెస్ట్ బెంగాల్‌కు చెందిన డెబీనా బెనర్జీ తన 20వ ఏట అంటే 2003లో ‘ఇండియన్ బాబు’ అనే హిందీ సినిమాలో చిన్న క్యారెక్టర్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాది రవిబాబు ‘అమ్మాయిలు అబ్బాయిలు’ మూవీలో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఫిలింతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత కన్నడలో శివ రాజ్ కుమార్ పక్కన ఆడిపాడింది. కొంత గ్యాప్ తర్వాత తమిళంలో విజయ్ కాంత్‌తో యాక్ట్ చేసింది. కానీ తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. ఇతర భాషల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకోవడంతో, స్టార్ హీరోయిన్‌గా కెరీర్ టర్న్ అవుతుందనుకున్నారు కానీ సీన్ రివర్స్ అయ్యింది.
మొదటి సినిమా చేసిన పదేళ్లకి 2013లో జగపతి బాబు నటించిన ‘సిక్స్’ అనే మూవీలో కనిపించింది. తమిళ్, హిందీలో టీవీ సీరియల్స్, సిరీస్‌లు చేసి పాపులర్ అయింది. రియాలిటీ షోలలోనూ పార్టిసిపెట్ చేసింది. ప్రముఖ టెలివిజన్ షో ‘రామాయణ్’ లో సీత పాత్రలో మెప్పించింది. 2011లో యాక్టర్ గుర్మీత్ చౌదరిని వివాహం చేసుకుంది. 2021లో 10 సంవత్సరాల తర్వాత ఈ జంట మరోసారి మ్యారేజ్ చేసుకోవడం విశేషం. వీరికి ఇద్దరు పాపలు సంతానం. ప్రస్తుతం హిందీలో వస్తున్న ఆఫర్లను వినియోగించుకుంటూ.. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంది డెబీనా బెనర్జీ. ప్రస్తుతం ఆమె పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్‌గా మారాయి.