90 హీరోయిన్స్ జాబితాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. వీరిలో మీనా, ప్రీతా, సంఘవి, సంగీత, మహేశ్వరిలు ఉన్నారు. ఇటీవల ఓ కార్యక్రమం సందర్భంగా వీరంతా కలుసుకున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సంఘవి ప్రముఖ నటుడు, విలన్ బబ్లూ పృధ్వీ రాజ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు
సినిమాలో ఫేడ్ అయిన స్టార్లంతా ఇటీవల మళ్లీ వెండి తెరపై కనిపించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. 80, 90 నటులంతా సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. పెరుగుతున్న టీవీ ఛాన్నళ్లు, కొత్తగా పుట్టుకొస్తున్న ఓటీటీలతో మంచి అవకాశాలు దక్కకపోతాయా అని ఎదురు చూస్తున్నారు. అలాగే కొంత మంది నటులు సినిమాలు, సీరియల్స్‌తో బిజీగా గడుపుతున్నారు. కస్తూరి సీరియల్స్‌తో బిజీ కాగా, అర్చన ఓ సినిమాతో మెరిశారు. అలాగే రాధ ఓ డ్యాన్స్ షోకు జడ్జిగా అలరించారు. నదియా, మీనా, రాశి, సిమ్రాన్, ప్రేమ, జ్యోతిక వీరంతా ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. నటి లయ చాలా రోజుల తర్వాత కనిపించింది. ఆమె కూడా సినిమాల్లో నటించేందుకు సిద్ధమైంది.
అయితే ఇటీవల 80, 90 తారలంతా ఒక్కటై.. ఆనందంగా గడుపుతున్నారు. 90స్ హీరో, హీరోయిన్స్ జాబితా చాలా పెద్దది. అయితే వీరిలో నటీమణులు మీనా, ప్రీతా, సంఘవి, సంగీత, మహేశ్వరిలు ఎప్పటికప్పుడు కలుసుకుంటూనే ఉంటారు. ఇటీవల ఓ కార్యక్రమం సందర్భంగా వీరంతా కలుసుకున్నారు. తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న సంఘవి ప్రముఖ నటుడు, విలన్ బబ్లూ పృధ్వీ రాజ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన తనను మోసం చేశారంటూ వాపోయారు. అతను చేసిన మోసం త్వరగా తెలిసిపోయిందని చెప్పారు. ఇంతకూ ఈ బబ్లూ ఫృధ్వీరాజ్ ఎవరనుకుంటున్నారా.. అదేనండీ పెళ్లి సినిమాలో మహేశ్వరీ భర్తగా చేసి భయపెట్టారుగా ఆయన. అసలు సంఘవిని ఫృధ్వీ ఏ విషయంలో మోసం చేశారంటే.?
తెలుగులో బుల్లి తెర షోల్లో ఒక్కటైన క్యాష్ ప్రొగ్రామ్‌కు వచ్చారు సంఘవి, మహేశ్వరి, ఫృధ్వీ, ఆకాష్‌లు. ఈ సందర్భంగా పృధ్వీ తనను చేసిన మోసం గురించి సంఘవి బయటపెట్టారు. ‘ ఓ రోజు షూటింగ్ ముగించుకుని రాత్రి పూట వస్తున్నాను. అంతలో పృధ్వీ వచ్చి నా వైఫ్ ప్రెగ్నెంట్. వీళ్లు కేక్ అడిగితే ఇవ్వడం లేదు అన్నాడు. నేను చాలా సీరియస్‌గా రెస్టారెంట్‌కు వెళ్లి పోయి కేక్ ప్యాక్ చేయించి ఇచ్చాను. తర్వాత ఎయిర్ పోర్టులో తనని, తన వైఫ్‌ను చూశాను. వెళ్లి ఎన్నో నెల అని అడిగాను. వాట్ హౌ మనీ మంత్సా అని అడిగింది. ప్రెగ్నెంట్ కాకపోయినా..అబద్దం చెప్పి ఆయన కేక్ తీసుకెళ్లారు’అని సంఘవి చెప్పింది. అయితే ఆయన ప్రెగ్నేంటేమో అని మహేశ్వరి అనే సరికి నవ్వులు పూశాయి.