తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది బాలనటులుగా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరో, హీరోయిన్ గా మారారు. అలాంటి వారిలో నటి మీనా ఒకరు. సిరివెన్నెల మూవీలో బాలనటిగా మీనా అద్భుతంగా నటించింది.
తెలుగు ఇండస్ట్రీలో నటి మీనా గురించి తెలియని వారు ఉండరు. ఇండస్ట్రీలో బాలనటిగా కెరీర్ ప్రారంభించిన మీనా.. ‘నవయుగం’ మూవీతో తెలుగులో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత ‘సీతారామయ్యగారి మనవరాలు’ మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది. అప్పటి నుంచి స్టార్ హీరోల సరసన నటిస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒక్క తెలుగులోనే కాదు తమిళ, మళియాళ, హిందీ, కన్నడ భాషల్లోని స్టార్ హీరోలందరితో మీనా నటించింది. అప్పట్లో మీనా గోల్డెన్ లెగ్ అంటూ పిలిచేవారు.. ఈమె నటించిన చాలా చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.
నటిగా మంచి ఫామ్ లో ఉన్న మీనా బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్‌ను 2009 జూలై 12న వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప నైనిక. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తేరీ (తెలుగులో పోలీస్) నైనిక చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. గత ఏడాది పోస్ట్ కొవిడ్ సమస్యలతో బాధపడుతూ ఆమె భర్త విద్యాసాగర్ కన్నుమూశారు. అప్పటి వరకు ఎంతో ఆనందంతో జీవితం గడిపిన మీనా భర్త మరణంతో కొంతకాలం డిప్రేషన్ లోకి వెళ్లింది. కొంతకాలం వరకు మీడియా ముందుకు కూడా రాలేదు. ఇప్పుడిప్పుడే ఆ ఛేదు అనుభం నుంచి బయటపడుతుంది. తాజాగా నటి సంఘవితో కలిసి మీనా డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇటీవల విశాల్ నటించిన ఎనిమీ మూవీలో టమ్ టమ్ పాటకు సంఘవితో కలిసి మీనా అదిరిపోయే స్టేప్పులు వేసింది. గత ఏడాది మోహన్ బాబు నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ మూవీలో ఓ కీలక పాత్రలో కనిపించింది. వెంకటేష్ తో కలిసి నటించిన దృశ్యం, దృశ్యం 2 మూవీతో మంచి ఫామ్ లోకి వచ్చింది. మీనా భర్త చనిపోయిన తర్వాత తెలుగు లో ఏ సినిమాలో నటించలేదు. ప్రస్తుతం తమిళంలో ‘రౌడీ బేబీ’ మూవీ, మలయాళంలో ‘జనమ్మ డేవిడ్’ మూవీలో నటిస్తుంది. వీటితో పాలు మరికొన్ని చిత్రాలకు కూడా ఆమె సైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ మద్య మీనా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. పలు విషయాలు తన ఫ్యాన్స్ పంచుకుంటున్నారు. ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. నటి మీనా.. సంఘవితో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా నెటిజన్ల నుంచి ఫుల్ రెస్పాన్స్ వస్తోంది.