సాధారణంగా వెండితెర, బుల్లితెర పై ఒక్కసారి కనిపిస్తే చాలు జన్మధన్యం రా బాబూ అనుకునే వాళ్లు ఏంతోమంది ఉన్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ స్టూడియోల వెంట వేల మంది పడిగాపులు కాస్తుంటారు. ఇక ఇండస్ట్రీలోకి ఎంట్రీ తర్వాత నటించే పాత్రల ప్రభావం కూడా ఉంటుంది.
వెండితెర అంటేనే రంగుల ప్రపంచం.. ఒక్కసారి వెండితెర, బుల్లితెరపై కనిపిస్తే చాలు సెలబ్రెటీ హూదా వస్తుందని ఎంతోమంది కళాకారులు ప్రతిరోజూ స్టూడియోల వెంట తిరుగుతూ ఉంటారు. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా కొంతమందికి అదృష్టం కలిసిరాదు.. కొన్నిసార్లు అనుకోకుండా వెండితెర, బుల్లితెరపై ఛాన్సులు అందుకునేవాళ్లు ఉంటారు. రీల్ లైఫ్ లో ఎంతో ఆనందంగా ఉండే నటీనటులు.. రియల్ లైఫ్ లో పలు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా విలన్ వేషాలు వేసేవారు.. ఎప్పుడైనా బయటికి వెళ్తే వారిపై కోపగించుకోవడం.. తిట్టడం లాంటివి చేస్తుంటారు. సోషల్ మీడియా వేధికగా బండబూతులు తిడుతుంటారు. తాజాగా ఓ బుల్లితెర నటికి ఇలాంటి ఛేదు అనుభవమే జరిగింది.. ఈ విషయం స్వయంగా ఆమె తెలిపింది. ఇంతకీ ఆ నటి ఎవరా అనుకుంటున్నారా? ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్ ఫేమ్ మాన్సీ. వివరాల్లోకి వెళితే..
ఇప్పటి వరకు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ వచ్చాయి.. అందులో ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్ ఒకటి. ఇందులో మాన్సీ క్యారెక్టర్ అంటే ఆడియన్స్ చెప్పలేనంత కోపం.. చిరాకు వస్తుంది. ప్రేమ ఎంత మధురం సీరియల్ కి మంచి ఫాలోయింగ్ ఉంది.. ఇందులో అను-ఆర్య క్యారెక్టర్స్ కి ఆడియన్స్ బాగా ఇష్టపడతారు.. అలాగే మాన్సీ అనే క్యారెక్టర్ చూస్తే కోపంతో ఊగిపోతారు. ఈ సీరియల్ లో మాన్సీ క్యారెక్టర్ విలన్.. దురుసుగా, కన్నింగ్ గా కనిపిస్తుంది. సీరియల్ లో మాన్సీ గా నటించిన నటి.. అచ్చమైన తెలుగు అమ్మాయి మహేశ్వరి. తాజాగా తన క్యారెక్టర్ గురించి చెబుతూ.. తన రియల్ లైఫ్ లో ఆ పాత్ర ప్రభావం ఎంతగా ఉందో అన్న విషయం గురించి మాట్లాడింది మహేశ్వరి.
నటి మహేశ్వరి మాట్లాడుతూ.. ‘నేను పుట్టింది పెరిగింది గుంటూరు. ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లు అవుతుంది.. ఇంటర్ చదువుతున్న సమయంలో ‘నా కోడలు బంగారం’ సీరియల్ ఆడీషన్స్ కి వెళ్లాను.. అదృష్టం కొద్ది సెలెక్ట్ అయ్యాను. ఇందులో నాది నెగిటీవ్ రోల్.. ఆ తర్వాత రాధమ్మ కూతురు సీరియల్ లో ఆఫర్ వచ్చింది. ఇందులో కూడా నేను నెగిటీవ్ రోల్ లో నటించాను. ఆ తర్వాత ప్రేమ ఎంత మధురం సీరియల్ లో మాన్సీ పాత్రలో నటించాను. విచిత్రం ఏంటంటే నాకు మొదటి నుంచి అన్నీ నెగిటీవ్ రోల్స్ వస్తున్నాయి.. తప్పని సరి పరిస్థితిలో నటించాల్సి వస్తుంది. ఇక అందరూ నన్ను నెగిటీవ్ గానే చూడటం మొదలు పెట్టారు. వాస్తవానికి నా కళ్లు పెద్దవిగా ఉంటాయి.. అందుకే బహుషా విలన్ పాత్రలే ఎక్కువగా వస్తున్నాయి.
సాధారణంగా టీవీ, సినీ ఇండస్ట్రీలో నటించే ఆడవారిపై రక రకాల రూమర్స్ ఉంటాయి. నా వర్క్ విషయానికి వస్తే మగవాళ్లతో పనిచేయాల్సి ఉంటుంది.. నాకు తల్లిదండ్రుల సపోర్ట్ చాలా ఉంది.. రూమర్స్ అనేవి ఇండస్ట్రీకి వచ్చినపుడే కాదు.. స్కూల్, కాలేజ్.. ఎక్కడైన పని చేస్తే అన్ని చోట్లా వస్తుంటాయి. వాటన్నింటికి ఎదుర్కొని బతకడం నేర్చుకోవాలి. ఇప్పటి జనరేషన్ లో కెరీర్ పైనే ఫోకస్ చేయాలి.. రూమర్స్ పై కాదు.. మనం మంచి దారిలో వెళ్తే ఏవీ అడ్డురావు. నేను ఎక్కువగా నెగిటీవ్ పాత్రల్లో నటించా కనుక నన్ను కొంతమంది సైకో అమ్మాయిగా ట్రీట్ చేస్తుంటారు.. బయట ఎక్కడికైనా వెళ్తే శ్రుతి, మాన్సీ అంటూ కోపంగా పిలుస్తుంటారు.. నిన్ను చూస్తే మాకుం చాలా కోపం వస్తుందని అంటుంటారు. నా పుట్టిన రోజున కూడా బండబూతులు తిడుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు. ఏది ఏమైనా నా క్యారెక్టర్ కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందన్న సంతోషం నాకు ఉంది. బుల్లితెరపై అలా కనిపిస్తాం.. రియల్ లైఫ్ లో మేమంతా ఫ్రెండ్స్ గా ఉంటాం అన్నారు మాన్సీ.