ఆకాష్ కు బాడి బిల్డింగ్ అంటే ఎంతో ఇష్టం. దీని ద్వారానే రాష్ట్రస్థాయిలో ప్రతిభను కనబరచాలని అనుకున్నాడు. అందుకోసం అనుక్షణం కసరత్తులు చేసేవాడు. కానీ, అతడు చేసిన ఈ చిన్నపొరపాటు కారణంగానే చివరికి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే?
చెన్నైలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువకుడు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రదర్శనను కనబరచాలని రాత్రి పగలు జిమ్ చేసేవాడు. గంటల తరబడి జిమ్ చేస్తూ బాడీని పెంచాలని కసరత్తులు చేశాడు. అయితే అంతా బాగానే ఉన్నా.. అతడు చేసిన ఈ చిన్న పొరపాటు కారణంగా చివరికి చేజేతులా తన ప్రాణాన్ని తానే తీసుకున్నాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?
చెన్నైలోని అవడి సమీపంలో జిమ్నాస్ట్ ఆకాష్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతనికి చిన్నప్పటి నుంచి జిమ్ చేసి కండలు తిరిగిన యోధుడిలా కనిపించాలని ఉండేది. అందుకోసం అతడు గత కొన్నేళ్ల నుంచి జిమ్ చేయడం మొదలు పెట్టాడు. అంతే కాకుండా.. ఆకాష్ రాష్ట్రస్థాయి పోటీల్లో సైతం పాల్గొని తన ప్రతిభను చాటాలని అనుకున్నాడు. ఇందు కోసం అతడు రాత్రింభవళ్లు జిమ్ సెంటర్ లో కసరత్తలు చేస్తుండేవాడు. ఇకపోతే ఆకాష్ తొందరగా ఫలితం రావడానికి ఇటీవల ఓవర్‌డోస్ స్టెరాయిడ్స్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. ఆకాశ్ ఇటీవల జిమ్ చేస్తూ కిందపడిపోయి రక్తపు వాంతులు చేసుకున్నాడు.
వెంటనే గమనించిన అతడి కుటుంబ సభ్యులు ఆకాష్ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆకాష్ తాజాగా ప్రాణాలు విడిచాడు. జిమ్నాస్ట్ ఆకాష్ ఓవర్‌డోస్ స్టెరాయిడ్స్ తీసుకున్నాడని, దీని కారణంగానే రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని వైద్యులు తెలిపారు. ఓవర్ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్లే అతడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. కుమారుడి మరణంతో మృతుడి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. సిక్స్ ప్యాక్ మోజులో పడి స్టెరాయిడ్స్ తీసుకుని చివరికి ప్రాణాలు కోల్పోయిన ఆకాష్ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.