సౌమ్యారావు.. జబర్దస్త్ కొత్త యాంకర్ గా అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. అతి కొద్ది కాలంలోనే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఇక సోషల్ మీడియాలో సైతం తన ఫోటోలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది ఈ కన్నడ బ్యూటీ. అయితే తాజాగా ఓ విషయంలో నెటిజన్స్ నుంచి ట్రోలింగ్ ఎదుర్కొంటోంది.
జబర్దస్త్.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బా నవ్విస్తున్న ఖతర్నాక్ కామెడీ షో. ఇక ఈ షో ద్వార పరిచయం అయిన కమెడియన్ లు ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. యాంకర్ లుగా అనసూయ, రష్మిలు తమ అందాలతో ఈ షోను మరో రేంజ్ కు తీసుకెళ్లారు అనడంలో సందేహం లేదు. అయితే అనసూయ జబర్దస్త్ మానేసిన తర్వాత.. కొన్ని రోజులు రష్మి ఇటు జబర్దస్త్ ను.. అటు ఎక్స్ ట్రా జబర్దస్త్ ను హ్యాండిల్ చేసింది. తర్వాత అనసూయ ప్లేస్ లోకి వచ్చింది కన్నడ బ్యూటీ సౌమ్యా రావు. తన ముద్దు ముద్దు మాటలతో త్వరగానే ప్రేక్షకులకు చేరువైంది. అయితే తాజాగా నెటిజన్స్ నుంచి ట్రోలింగ్స్ ను ఎదుర్కొంటోంది. ఎందుకంటే?
సౌమ్యారావు.. జబర్దస్త్ కొత్త యాంకర్ గా అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. అతి కొద్ది కాలంలోనే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఇక సోషల్ మీడియాలో సైతం తన ఫోటోలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది ఈ కన్నడ బ్యూటీ. వచ్చీ రానీ తెలుగు పదాలతో సౌమ్యా చలాకీగా మాట్లాడుతుంటే.. అభిమానులు ఎంజాయ్ చేస్తుంటారు. ఆమె అందానికి, ఆ మాటలకు ఫిదా అయ్యారు తెలుగు అభిమానలు. అయితే కొన్ని రోజులుగా ఈ జబర్దస్త్ యాంకర్ ఓ విషయంలో ట్రోలింగ్ ను ఎదుర్కొంటోంది. అది ఏ విషయం అంటే.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది సౌమ్యారావు.
తాజాగా ఓ పాటకు డ్యాన్స్ వేసింది.. ఆ డ్యాన్స్ ను చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అదేం డ్యాన్స్ మేడం, ఇంకోసారి ఇలా డ్యాన్స్ చేయకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సౌమ్యా హ్యాపీగా యాంకరింగ్ చేసుకోక.. ఎందుకు ఇవన్నీ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక కన్నడ ఇండస్ట్రీకి చెందిన సౌమ్య.. పలు సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. మరి సౌమ్యా రావు డ్యాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.