విషాదం నెలకొంది. బుల్లితెర ఢీ షో డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఆత్మహత్య చేసుకున్నారు.
తెలుగు టెలివిజన్ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. టాప్ డ్యాన్స్ షో అయిన ‘ఢీ’లో కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్న చైతన్య అనే డ్యాన్స్ మాస్టర్ సూసైడ్ చేసుకున్నారు. ఆయన మృతితో తెలుగు టీవీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. నెల్లూరులోని క్లబ్ హోటల్లో ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. చైతన్య సూసైడ్‌కు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. కాగా, సూసైడ్ చేసుకోవడానికి ముందు చైతన్య తన సెల్ఫీ వీడియో రికార్డ్ చేయడం గమనార్హం. ఆత్మహత్య చేసుకుంటున్నందుకు తన తల్లిదండ్రులు, తోటి డ్యాన్స్ మాస్టర్లు, డ్యాన్సర్లకు చైతన్య క్షమాపణలు చెప్పారు. అప్పులు ఇచ్చిన వారి నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని.. ఎంత ప్రయత్నించినా తనకు అవ్వడం లేదని ఆ వీడియోలో చైతన్య వాపోయారు.
ఒక అప్పును తీర్చేందుకు మరో అప్పు.. అలా అప్పుల భారం పెరిగిపోయిందని సెల్ఫీ వీడియోలో చైతన్య వెల్లడించారు. తనకు ఇంత పాపులారిటీ, క్రేజ్ ఇచ్చిన ‘ఢీ’ షోకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తనకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పటికీ.. సంపాదన మాత్రం పెద్దగా రాలేదన్నారు. ఈ షోలో కంటే జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని సెల్ఫీ వీడియోలో చైతన్య పేర్కొన్నారు. డ్యాన్స్ మాస్టర్ చైతన్య సూసైడ్ విషయం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన బాడీని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. చైతన్య కుటుంబ సభ్యులకు ఆయన ఆత్మహత్య చేసుకున్నారనే విషయాన్ని తెలియజేశారు. చైతన్య మరణంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
‘ఢీ’ అనే డ్యాన్స్ షోలో కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన మాస్టర్ చైతన్య ఆత్మహత్య చేసుకున్నాడు. – Master Chaitanya, who was a choreographer in the dance show DHEE , committed suicide. #RTVnewsnetwork @mallemalatv #chaitanya #dancemaster #sucide pic.twitter.com/rnWgUXx08x
— RTV (@RTVnewsnetwork) April 30, 2023