జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు టాలీవుడ్‌కి పరిచయమయ్యారు. జబర్దస్త్ వేదికగా ఎంతోమంది సెలబ్రిటీలుగా రాణిస్తున్నారు. జబర్దస్త్ తమకు లైఫ్ ఇచ్చిందని, జబర్దస్త్ లేకపోతే తాము లేమని హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లాంటి కమెడియన్లు గతంలో అనేకసార్లు వ్యక్తపరిచారు. అయితే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన కిరాక్ ఆర్పీ లాంటి వాళ్ళు మాత్రం జబర్దస్త్ వల్ల తమకు లైఫ్ రాలేదన్నట్టు మాట్లాడారు. అంతేకాకుండా జబర్దస్త్ షోపై, షో నిర్వాహకులపై కిరాక్ ఆర్పీ సంచలన ఆరోపణలు చేశారు. దానికి హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, జబర్దస్త్ మేనేజర్ ఏడుకొండలు, షేకింగ్ శేషు వంటి వారు కౌంటర్ వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో ఈ వివాదం రెండు రోజులు నడిచి చల్లబడింది. అయితే మళ్ళీ జబర్దస్త్‌కి సంబంధించి చలాకి చంటి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకి జబర్దస్త్ వల్ల పేరు రాలేదని అన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు.
జబర్దస్త్ ఆర్టిస్టులకి సినిమా అవకాశాలు పెద్దగా రావని, సినిమాల విషయంలో జబర్దస్త్ ఆర్టిస్టులు మోసపోతుంటారని, స్క్రిప్ట్ చెప్పేటప్పుడు ఉన్న పాత్ర నిడివి సెట్స్‌పైకి వెళ్ళాక ఉండదని అంటుంటారు అది నిజమేనా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు చలాకీ చంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకి జబర్దస్త్ వల్ల పేరు రాలేదని, సినిమాలు చేసిన తర్వాతే తాను జబర్దస్త్ షోకి వచ్చానని అన్నారు. సినిమాల గురించి నాకు తెలుసు కాబట్టి తాను మోసపోలేదని, బహుశా మిగతా వాళ్ళకి అది తెలియకపోవడం వల్ల అలా జరుగుతుండచ్చునని అన్నారు. తాను 20 సినిమాలు చేసి జబర్దస్త్‌కు వెళ్ళానని, స్కిట్ వేరు, సినిమా వేరు.. ఆ తేడా తనకు తెలుసని అన్నారు. దీంతో ఇప్పుడు చలాకి చంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరి చలాకి చంటి వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.