అద్భుతమైన ప్రతిభతో నాచురల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో నాని. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటాడు నాని. అయితే అప్పుడప్పుడు చేసే కొన్ని వ్యాఖ్యలు నానిని వివాదంలో చిక్కుకునేలా చేస్తాయి. మరీ ముఖ్యంగా ఏపీలో సినిమా టిక్కెట్ రేట్ల ధర విషయంలో నాని చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైసీపీ నేతలు ఓ రేంజ్‌లో నానిపై విరుచుకుపడ్డారు. వివాదాల సంగతి అటుంచితే.. కొంత కాలంగా నానిని వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. అంటే సుందారినికి దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం నాని దసరా సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం నాని, ఆయన కుటుంబ సభ్యుల ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సంప్రదాయబద్దంగా, పంచెకట్టులో ఉన్న నాని లుక్ అందరిని ఆకట్టుకుంటుంది. ఆ వివరాలు.. తాజాగా నాని తన భార్య, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేశాడు. ఈ సందర్భంగా నాని, ఆయన కుమారుడు అర్జున్ సంప్రదాయబద్దంగా పంచెకట్టులో కనిపించారు. వ్రతంలో భాగంగా నాని, ఆయన కుమారుడు సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. నాని తల్లిదండ్రులు కూడా పూజలో పాల్గొన్నారు. నాని భార్య అంజనా కూడా చీరకట్టులో చూడముచ్చటగా ఉన్నారు. కరోనా లాక్‌డౌన్‌కి ముందే నాని కొత్త విల్లాలోకి మారాడు. తన కుటుంబంతో కలిసి షిఫ్ట్ అయ్యాడు. అప్పటి నుంచి సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించేందుకు సమయం దొరకలేదట. నానికి దైవభక్తి కాస్త ఎక్కువేనట. ఈ క్రమంలో కొత్త విల్లాలోకి మారిన చాలా రోజుల తర్వాత ఆదివాం భార్య, కుటుంబ సభ్యులతో కలిసి ఇలా ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించాడు నాని. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Nani (@nameisnani) ఇది కూడా చదవండి: నాని కామెంట్స్ వైరల్.. అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు రవితేజ..! ఇది కూడా చదవండి: మంచి సినిమా చేయమని కంప్లైంట్ చేయడం కాదు.. అవి వచ్చినప్పుడు చూడాలి కదా?: నాని