శ్రీవాణి.. నటిగా, డాన్సర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ కూడా మెయిన్‌టైన్ చేస్తూ ప్రేక్షకులకు ఎంతో దగ్గరగా ఉంటూ ఉన్నారు. ఆ ఛానల్‌లో వారి రొటీన్ లైఫ్, స్పెషల్ అకేషన్స్ ని పంచుకోవడమే కాదు.. సహాయం కూడా చేస్తుంటారు. అయితే ఒక నెల క్రితం మాత్రం అభిమానులకు శ్రీవాణి ఓ షాకింగ్ వార్త చెప్పారు.
గొంతు బాలేదని ఆస్పత్రికి వెళ్లగా.. వైద్యులు నెల రోజులు మాట్లాడకూడదంటూ చెప్పారు. ఆ వార్త విన్న తర్వాత శ్రీవాణి కుటుంబంతో పాటుగా అభిమానులు కూడా ఎంతో బాధ పడ్డారు. ఒక నెల రోజులు మాట్లాడకుండా ఉంటేనే మీకు మళ్లీ వాయిస్ వస్తుంది. లేదంటే జీవితంలో మళ్లీ మాట్లాడలేకపోవచ్చు అని వైద్యులు హెచ్చరించారు. జులై 19న ఆ మాట చెప్పగా.. మళ్లీ ఆగస్టు 19 వరకు శ్రీవాణి మాట్లాడకుండానే ఉన్నారు.
అయితే మళ్లీ ఆగస్టు 19న వైద్యులను కలిసిన శ్రీవాణి దంపతులకు వైద్యులు గుడ్ న్యూస్ చెప్పారు. అంతా పూర్తిగా తగ్గిపోయిందని ఇంక మామూలుగా మాట్లాడచ్చని వెల్లడించారు. అదే విషయాన్ని వాళ్లు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులతో పంచుకుని భావోద్యేవాగానికి గురయ్యారు. మళ్లీ తిరిగి మాట్లాడగలుగుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నట్లు వెల్లడించారు.
“వైద్యులు అంతా సెట్ అయ్యిందని చెప్పారు. నేను మాట్లాడలేకపోయినా.. మీరు పెట్టే మెసేజ్‌లు చదువుతూ ఉన్నాను. 2002 నుంచి ఇప్పటివరకు 20 ఏళ్లుగా నేను ఇండస్ట్రీలో ఉన్నాను. కానీ, నాకు ఇంత మంది అభిమానులు ఉన్నారని నాకు ఇప్పటిదాకా తెలియదు. ఎంతో మంది నా కోసం ఉపవాసం ఉన్నామన్నారు, ప్రే చేశారు. అందరికీ చాలా థాంక్స్” అంటూ శ్రీవాణి భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీవాణి తిరిగి మాట్లాడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.