యాంకర్ శ్యామల తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు. తనదైన యాంకరింగ్ తో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని సెట్ చేసుకుంది. కాకినాడకు చెందిన ఈ అందాల రాశి.. సీరియల్ లో అవకాశం రావడంతో హైదరాబాద్ వచ్చింది. అలా బుల్లితెరపై అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు సీరియల్స్ లోనూ, సినిమాల్లోనూ నటించింది. ఆ తర్వాత యాంకర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అంతే ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. యాంకర్ గా బిజీ అయిపోయింది. బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లొచ్చిన తర్వాత ఈమె క్రేజ్ మరింత పెరిగింది. టీవీ షోస్, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ మీట్ ఈవెంట్లు ఇలా వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది.
యాంకరింగ్ లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. తన గ్లామరస్ పిక్స్ తో ఫాలోవర్స్ కి ట్రీట్ ఇస్తుంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేస్తుంటుంది. ఈ క్రమంలో ఆమె బర్త్ డే ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో శ్యామల పుట్టినరోజు ఘనంగా జరిగింది. భర్త నరసింహ, కొడుకుతో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.