చాలా తక్కువ మంది మాత్రమే తనకు పుట్టకపోయినప్పటికీ సొంత పిల్లల్లా చూసుకుంటారు. అలాంటి వారిలో మంచు మనోజ్ ఒకరు. కన్న కొడుకుకి చేసే దానికంటే ఎక్కువే చేస్తున్నారు తన కొడుకు ధైరవ్ కోసం. ఇందుకే కదా మనోజ్ ని గ్రేట్ అనేది.
విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో రాకింగ్ స్టార్ మంచు మనోజ్. ఈ మధ్య సినిమాల వేగం కాస్త తగ్గించాడు. రెండో పెళ్లి చేసుకుని మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. మంచు మనోజ్ ఇటీవల భూమా మౌనికను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికి ఇది రెండో వివాహం. అయితే మౌనికకు ముందే “ధైరవ్’ అనే అబ్బాయి ఉన్నాడు. మనోజ్ ఆ ఆబ్బాయిని తన సొంత కొడుకుగా ప్రకటించిన విషయం అందరికీ తెలుసు. మౌనికతో పెళ్లయ్యాక ధైరవ్ మొదటి పుట్టిన రోజు కావడంతో గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాలో నోట్ రాశాడు. అలాగే తన కొడుకు పుట్టినరోజు వీడియో కూడా పోస్ట్ చేశాడు. అవి నెట్టింట వైరల్‌గా మారాయి.
“ఈ పవిత్రమైన రోజున, నాకు అమూల్యమైన నిధిని కానుకగా ఇచ్చినందుకు నేను శివునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా కొడుకు ధైరవ్ నా జీవితంలోకి రావడం నా అదృష్టం. ఇది నా ప్రయాణానికి నాంది, నేను ప్రతిరోజూ ఎంతో ఆరాధించే ప్రయాణం. భూమా మౌనిక ప్రేమ నన్ను చాలా అందమైన మార్గంలో నడిచేలా చేసింది. నీ ముసి ముసి నవ్వుల సంగీతం, నీ కౌగిలింతల వెచ్చదనం లేని జీవితాన్ని నేను ఉహించుకోలేను. నా ప్రపంచాన్ని ప్రకాశవంతం చేసింది, నా హృదయాన్ని అపరిమితమైన ఆనందంతో నింపింది నువ్వే. 5వ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియమైన బంగారం ధైరవ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కొరుకుంటున్నాను. నా చిన్ని బాబు నీ ప్రయాణం ఇప్పుడిప్పుడే మొదలవుతుంది, అడుగడుగునా నీ చేయి పట్టుకొని నీవెంట నడుస్తున్నందుకు నాకు చాలా ఆనందంగానూ, ఉత్సాహంగానూ ఉంది”. అంటూ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చాడు.
అయితే మౌనిక కొడుకుని ఇప్పుడు మనోజ్ సొంత కొడుకులా.. తండ్రి స్థానంలో ఉండి అన్ని చూసుకుంటున్నాడు. తాజాగా కొడుకు ధైరవ్ పుట్టినరోజు వేడుకలని మనోజ్ చాలా గ్రాండ్ గా నిర్వహంచారు. దానికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొడుకుని ఎత్తుకొని కేక్ కట్ చేయించాడు. మౌనిక కంటే ఎక్కువ ప్రేమతో దగ్గరుండి ధైరవ్ తో కేక్ కట్ చేయించడమే కాకుండా అతనికి ఇష్టమైన విధంగా మొత్తం డెకరేషన్ చేయించారు. దీంతో నెటిజన్స్ మంచు మనోజ్ ని అభినందిస్తున్నారు. ఈరోజుల్లో సవతి తల్లి గానీ, సవతి తండ్రి గానీ తనకు పుట్టలేదన్న కారణంతో దూరం పెడతారు. అలాంటిది రెండో భార్య కొడుకైనా కూడా మంచు మనోజ్ కన్న కొడుకులా ట్రీట్ చేస్తున్నారు. కన్న కొడుకుకి ఒక తండ్రి చేసే దాని కంటే ఎక్కువే ధైరవ్ కోసం చేశారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి మంచు మనోజ్ వ్యక్తిత్వంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
On this auspicious day, I thank Lord Shiva for gifting me an invaluable treasure, you, my brave boy #Dhairav . Your entrance into my world wasn’t just an event, it was the beginning of a journey that has made me a better man, a journey that I cherish every single day.
Your… pic.twitter.com/HhUvAKbIFH
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) August 1, 2023