స్టార్ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ లాస్య తన భర్తను గురించి చెబుతూ.. ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది. ఇటీవలే రెండో బిడ్డకు జన్మనిచ్చిన ఆమె తాజాగా ఎమోషనల్ పోస్ట్ ను అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాకా.. ప్రతీ చిన్న విషయాన్ని అందులో షేర్ చేసుకుంటున్నాం. ఇక సెలబ్రిటీలు అయితే వారింట్లో ఏ చిన్న వేడుక జరిగినా గానీ అందుకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా స్టార్ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ లాస్య తన భర్తను గురించి చెబుతూ.. ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది. ఇటీవలే రెండో బిడ్డకు జన్మనిచ్చిన ఆమె తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ ను అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంది. ఇంతకీ ఆ ఎమోషనల్ పోస్ట్ లో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.
యాంకర్ లాస్య.. అప్పట్లో యాంకర్ రవితో కలిసి బుల్లితెరను ఓ ఊపుఊపారు. ఈ ఇద్దరి యాంకరింగ్ జోడీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందంటేనే అర్ధం చేసుకోవచ్చు వీరి క్రేజ్. ఇక లాస్య బిగ్ బాస్ కు వెళ్లి మరింత పేరు, గుర్తింపును దక్కించుకుంది. ఈ క్రమంలోనే లవ్ మ్యారేజ్ చేసుకుని యాంకరింగ్ కు గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం ఓ మంచి భార్యగా.. గృహిణిగా ఇంటి బాధ్యతలు చూసుకుంటోంది. ఇక ఇటీవలే రెండో బిడ్డకు జన్మనిచ్చిన లాస్య.. తాజాగా తన భర్తపై ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది. అసలు విషయం ఏంటంటే? గురువారం(మార్చి16) న లాస్య భర్త మంజునాథ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ లో తన భర్తపై ప్రేమను కురిపిస్తూ.. ఎమోషనల్ పోస్ట్ పెట్టి, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఆ పోస్ట్ లో ఈ విధంగా రాసుకొచ్చింది లాస్య.
“పుట్టిన రోజు శుభాకాంక్షలు మంజునాథ్.. నువ్వు నా కన్నీళ్లు తుడిచావు, నన్ను నవ్వించావు, గట్టిగా హగ్ చేసుకున్నావు. ఇక నా విజయాలను, వైఫల్యాలను చూశావు. ఏ సమయంలోనైనా నా వెన్నంటే ఉండి.. ధైర్యాన్ని ఇచ్చావు లవ్ యూ” అంటూ భర్తపై ప్రశంసల వర్షం కురిపించింది లాస్య. అంతేకాక ఓ సంపూర్ణమైన భర్తకు భార్యగా ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను అంటూ ఎమోషనల్ అయ్యింది. మంజునాథ్ కౌగిలిలో బంధీగా ఉన్న ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది లాస్య. అయితే లాస్య తన భర్త పుట్టిన రోజు సందర్భంగా షేర్ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ లాస్య అభిమానులను, ఫాలోవర్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. దాంతో మంజునాథ్ కు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు నెటిజన్లు.