మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఓవైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు ప్రొడక్షన్ లోకి కూడా ఎంటర్ అయ్యాడు. ఇటీవల సితార బ్యానర్ లో నిర్మితమవుతున్న సినిమాలలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో త్రివిక్రమ్ ఇన్వాల్వ్ మెంట్ అయితే కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎలాంటి పెట్టుబడి లేకుండా దర్శకుడు త్రివిక్రమ్ కి కోట్లు అందుకోబోతున్నాడని సినీ వర్గాలు చెబుతున్నాయి.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఓవైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు ప్రొడక్షన్ లోకి కూడా ఎంటర్ అయ్యాడు. ఇటీవల సితార బ్యానర్ లో నిర్మితమవుతున్న సినిమాలలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో త్రివిక్రమ్ ఇన్వాల్వ్ మెంట్ అయితే కనిపిస్తోంది. నేరుగా పోస్టర్స్ పై త్రివిక్రమ్ పేరు లేకపోయినా.. ఆయన సతీమణి సాయి సౌజన్య పేరు బాగా వినిపిస్తోంది. ఇటీవల విడుదలైన సార్ సినిమా.. త్రివిక్రమ్ పంట పండించినట్లు టాక్. ఎందుకంటే.. సార్ సినిమా విషయంలో ఎక్కువ బాధ్యతలు ఆయనే తీసుకొన్నారు. కథా చర్చల దగ్గరనుండి తెరపైకి వచ్చేదాకా సార్ మూవీని వెనకుండి నడిపించారు త్రివిక్రమ్.
సార్(తమిళంలో వాతి) మూవీ ధనుష్ హీరోగా.. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సినిమా. శివరాత్రి సందర్భంగా థియేట్రికల్ రిలీజై.. సూపర్ సక్సెస్ అందుకుంది. ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ రావడంతో.. సార్ సినిమా కలెక్షన్స్ కూడా అదరగొట్టేసింది. ఏకంగా మూడో వారం రూ. 100 కోట్లు దాటి బాక్సాఫీస్ వద్ద పరుగులు తీస్తోంది. ఆయితే.. తమిళ/తెలుగు భాషలలో కలిపి.. వరల్డ్ వైడ్ రూ. 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సార్ మూవీ.. ఇప్పటిదాకా రూ. 100 కోట్ల గ్రాస్, రూ. 53 కోట్ల మేరా షేర్ వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన సార్ మూవీకి రూ. 17 కోట్లపైగా లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఎలాంటి పెట్టుబడి లేకుండా దర్శకుడు త్రివిక్రమ్ కి కోట్లు అందుకోబోతున్నాడని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాలు తీసిన వెంకీ అట్లూరి.. సార్ తీశాడంటే ఒక్కసారిగా చూసిన ప్రేక్షకులంతా నమ్మలేకపోయారు. లవ్ స్టోరీస్ తో టైంపాస్ సినిమాలు తీసిన వెంకీనా.. సార్ సినిమా తీసింది? అని అవాక్కయ్యారు. కానీ.. ఈ సినిమాకి దర్శకుడు వెంకీనే అయినా.. మొత్తం సినిమాని ముందుండి నడిపించింది మాత్రం త్రివిక్రమ్ యే అని వెంకీ కూడా ప్రెస్ మీట్ లో చెప్పాడు. ఆయన సపోర్ట్ లేకపోతే.. సినిమాలో అలాంటి బలమైన డైలాగ్స్ రాయడానికి, సన్నివేశాలు అంతలా పండటానికి స్కోప్ ఉండేది కాదని చెప్పాడు.
ఈ నేపథ్యంలో.. దర్శకుడిగా వెంకీకి క్రెడిట్ వచ్చినప్పటికీ.. సినిమాను తెరపై వచ్చేదాకా వెన్నంటి ఉండి.. ఓ మంచి సినిమాని ప్రేక్షకుల వరకు తీసుకొచ్చిన క్రెడిట్ త్రివిక్రమ్ కే దక్కుతుంది. సో.. ఇప్పుడు సినిమా కూడా ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకొని డబుల్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వైపు దూసుకుపోతోంది. అయితే.. తాజా సమాచారం ప్రకారం.. సితారలో ఎన్నాళ్ళుగానో భాగస్వామ్యమై ఉన్న త్రివిక్రమ్ కి.. సార్ సినిమా లాభాలలో కొంత వాటాని నిర్మాతలు ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. అది కూడా కొన్ని కోట్ల రూపాయలు త్రివిక్రమ్ చేతికి చేరనున్నాయని వినికిడి. ఈ విధంగా చూసుకుంటే.. నిర్మాతగా రూపాయి పెట్టకపోయినా త్రివిక్రమ్ కోట్లు తీసుకోబోతున్నాడనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి ఈ విషయంలో మేకర్స్ నుండి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటించింది. మరి త్వరలో దీనిపై మరిన్ని వివరాలు వెలువడనున్నాయట. సో.. సార్ సినిమా విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
👉#Vaathi/#SIRMovie 17days WW collections:
👉Tamilnadu-36.25cr
👉Ap/ts-35.25cr
👉KA-7.95cr
👉Kerala-1.15cr
👉ROI-1.15cr
👉OS-23.25cr👉Total 17days WW gross-105cr💥
👉Total 17days WW share-55cr💥
👉Recovery-157%👌
👉Verdict-BLOCKBUSTER👌“4TH 100CR GROSSER FOR @dhanushkraja“💥 pic.twitter.com/vl9OCzC8bh
— RCFAN-SK18🦁 (@Rcfan_sk) March 6, 2023