దళపతి విజయ్– పూజా హెగ్దే జంట నటించిన చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 13న విడుదల అయ్యింది. అయితే ఈ సినిమాకి ఆశించిన మేర స్పందన రాలేదని తెలుస్తోంది. ఉదయం నుంచి సోషల్ మీడియాలో సినిమాపై నెగెటివ్ టాక్ ఎక్కువగా నడుస్తోంది. విజయ్- నెల్సన్ కాంబోలో ఊహించుకున్న సినిమా ఏంటి? అక్కడ తీసిన సినిమా ఏంటని అభిమానులు సైతం ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా తమ అభిమాన హీరో సినిమా బ్లాక్ బస్టర్ టాక్ రాగానే పాలాభిషేకాలు, బాణసంచా కాల్చడాలులాంటి అట్టహాసాలు ఎన్నో చూస్తుంటాం. కానీ, హీరో విజయ్ ఫ్యాన్స్ మాత్రం సినిమా బాలేదని హద్దుమీరి ప్రవర్తించారు.
ఇదీ చదవండి: ‘బీస్ట్’ సినిమా చూసిన వారికి బంపర్ ఆఫర్..! లీటర్ పెట్రోల్ ఫ్రీ..
విషయం ఏంటంటే.. ఎన్నో అంచనాల మధ్య థియేటర్‌కు వెళ్లి అభిమానులకు ఆ సినిమా నచ్చలేదంటూ దారుణంగా ప్రవర్తించారు. ఎక్కడైనా సినిమా బాగోకపోతే పోస్టర్లు చించుతారు, కటౌట్లు తీసేస్తారు. ఇక్కడ హీరో విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఏకంగా సినిమా ప్రదర్శిస్తున్న తెరకు నిప్పుపెట్టేశారు. తమిళనాడులోని ఓ థియేటర్లో ఈ ఘటన జరిగింది. సినిమా చూస్తుండగా తమకు నచ్చలేదంటూ కొందరు అభిమానులు స్క్రీన్కు నిప్పంటించారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Frustrated Vijay fans firing Theatres Screens #BeastDisaster
— 🔥 Ajith Kumar🔥 (@Anythingf4AJITH) April 13, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.