డైరెక్టర్ సుకుమార్.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ పేరు బాగా వినిపిస్తోంది. ఒక్క డైరెక్టర్ గానే కాకుండా.. రైటర్ గా, నిర్మాతగా కూడా సూపర్ ట్రాక్ లో ఉన్నాడు. అల్లు అర్జున్ తో పుష్ప సినిమా తీసి పాన్ ఇండియా లెవల్లో సుకుమార్ తన మార్క్ ని చూపించాడు. తెలుగు సినిమా అంటే బాలీవుడ్ వాళ్లు చొక్కాలు చింపుకునేలా చేశాడు. ఎక్కడ చూసినా పుష్పరాజ్ గురించే మాట్లాడుకునేలా చేశాడు. తెలుగు ప్రేక్షకుల కంటే బాలీవుడ్ ప్రేక్షకులే ఎక్కువగా పుష్ప ది రైజ్ కోసం ఎదురుచూసేలా చేశాడు. ఇటీవలే రష్యాలో కూడా పుష్ప సినిమాని విడుదల చేసి రికార్డులు సృష్టించారు. ఇప్పటికే పుష్ప-2 సినిమా షూటింగ్ పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సుకుమార్ విషయంలో మరో విషయం వైరల్ గా మారింది.
ప్రభాస్ తో కలిసి సుకుమార్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే నిర్మాత కూడా రెడీగా ఉన్నారంటూ టాక్ వినిపిస్తోంది. ఆ ప్రాజెక్టు పాన్ ఇండియా స్థాయిలో ఉండబోచున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 2024లో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కథని కూడా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడని, పుష్ప సినిమాని మించి ఈ మూవీ ఉండబోతోంది అంటూ చెబుతున్నారు. ఈ వార్త వినగానే డార్లంగ్ ఫ్యాన్స ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమ హీరో ఖాతాలో మరో హిట్ పడబోతోంది అంటూ ఇప్పటినుంచే సంబరాలు చేసుకుంటున్నారు. ప్రభాస్ కూడా ఈ సినిమాపై కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటున్నారు.
ప్రభాస్ నుంచి ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్-కే వంటి చిత్రాలు రానున్న విషయం తెలిసిందే. ఆదిపురుష్, సలార్ సినిమాలు వరుసగా విడుదల అయినా.. ప్రాజెక్ట్-కే ఎప్పుడు వస్తుంది అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. 2024లో షూట్ స్టార్ట్ చేసి సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాని విడుదల చేసేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. పుష్ప-2 సినిమా తర్వాత ప్రభాస్ ప్రాజెక్ట్ మీదే సుకుమార్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రభాస్ లిస్ట్ లో ఉన్న సినిమాలతో పాటుగా సుకుమార్ ప్రాజెక్ట్ చేరడంతో లెక్కలు మొత్తం మారిపోయాయి అంటున్నారు. ఇంక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే… ఆదిపురుష్ పై అభిమానులు మాత్రం భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ప్రశాంత్ నీల్- ప్రభాస్ చేస్తున్న సలార్ సినిమా కోసం దేశంలో ఉన్న సినిమా ప్రేక్షకులు అంతా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్-2 తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి రానున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరోవైపు ప్రభాస్-మారుతి సినిమాకి కూడా భారీ బడ్జెట్ కేటాయించారు. తాజాగా ఆ షూట్ కి సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇలా ప్రభాస్ తన తర్వాతి సినిమాలను ఎంతో పక్కాగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ లిస్టు చూస్తుంటే.. వరుస విజయాలతో డార్లింగ్ ఫ్యాన్స్ సంబరాలకు అవధులు లేకుండా పోతాయంటూ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
#Prabhas𓃵 ~ #Sukumar 🔥🔥
Box-office ki band ey 🤙🤙#Salaar #Prabhas #ProjectK #Adipurush #Rajadeluxe #Spirit pic.twitter.com/CKcz6L03kR— Prabhas (@DHF_PRAB00S_) December 26, 2022