బుల్లితెర సెలబ్రిటీలలో సుడిగాలి సుధీర్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ ని మెల్లగా ప్లాన్ చేసుకుంటూ.. అటు అవకాశం వచ్చిన సినిమాల్లో నటిస్తూనే, ఇటు టీవీ ప్రోగ్రాంలు చేస్తున్నాడు. అయితే.. సుధీర్ టీవీ సెలబ్రిటీ అయినప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో టాలీవుడ్ హీరోల స్థాయిలో దక్కించుకున్నాడు. సుధీర్ ఏ షోలో కనిపిస్తే ఆ షోని సూపర్ హిట్ చేస్తుంటారు ఫ్యాన్స్.
ఇటీవలే సుధీర్ ఢీ షోకి దూరమైన సంగతి తెలిసిందే. సుధీర్ లేకపోయేసరికి ఢీ షో రేటింగ్స్ కూడా పడిపోయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సుధీర్ ఎక్స్ ట్రా జబర్దస్త్ లో కంటిన్యూ అవుతున్నాడు. అయితే.. తాజా సమాచారం ఎక్స్ ట్రా జబర్దస్త్ తో కూడా సుధీర్ అగ్రిమెంట్ ముగిసిందని టాక్ నడుస్తుంది. మరి ఎప్పటివరకు ఉంటాడో తెలియదని అంటున్నాయి టీవీ వర్గాలు. సుధీర్ – రష్మీ జోడి ఏ షోలో కనిపించినా అది సూపర్ హిట్ అవుతుందనేది సెంటిమెంట్. అలాగే వీరిద్దరూ కలిసి చేసిన షోలు మాత్రమే హిట్ అవుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. తాజాగా రిలీజ్ అయిన ఎక్స్ ట్రా జబర్దస్త్ స్కిట్ లో.. సుధీర్ ని ఆడుకున్నారు టీమ్ మేట్స్.
‘కమెడియన్ బాబు హీరోగా అవకాశం వచ్చింది చెయ్యమంటావా..? అని నరేష్ ని అడగగానే.. ‘వీడిలా అయిపోతావ్’ అంటూ సుధీర్ ఫేస్ చూపిస్తాడు. అలాగే హీరోకి అసిస్టెంట్ గా గొడుగు పట్టుకున్న సుధీర్.. ‘మా తమ్ముడి బర్త్ డే ఉంది. వీడియో బైట్ కావాలి’ అని బాబును అడుగుతాడు. దానికి బాబు.. “ఏ రోజైనా నువ్వు హీరోగా ఉన్నప్పుడు బైట్ ఇచ్చావా? నువ్వు పెద్ద మహేష్ బాబు” అంటూ సుధీర్ పై పంచులు వేశాడు.
అయితే హీరో బాబు అవమానించినా.. రష్మీ మాత్రం ‘సుధీర్ గారు సెల్ఫీ’ అంటూ సుధీర్ తో సెల్ఫీ దిగి షాకిస్తుంది. ‘ఇప్పుడు ఫోటో అడగగానే ఇచ్చావు. నువ్ హీరోగా ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు?” అని సుధీర్ ని కొట్టే స్కిట్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే.. సుధీర్ స్కిట్స్ వల్లే ఎక్స్ ట్రా జబర్దస్త్ రేటింగ్స్ బాగుంటున్నాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. మరి త్వరలో సుధీర్ ఈ షోకి దూరమైతే పరిస్థితి ఏంటా..? అని నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి సుధీర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.