సుడిగాలి సుధీర్ ప్రస్తుతం హీరోగా గోట్ అనే సినిమాలో నటిస్తున్నారు. పాగల్ దర్శకుడు కుప్పిలి నరేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ తాజాగా పూర్తయింది.
బుల్లితెరపై కమెడియన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి.. హీరో స్థాయికి ఎదిగారు సుడిగాలి సుధీర్. జబర్థస్త్ షోలో సాధారణ కమెడియన్‌గా మొదలైన అతడి జీవితం.. అంచెలంచెలుగా పైకి ఎదిగింది. తన ఉన్నతమైన యాటియ్యూడ్‌తో ప్రేక్షకుల మనసును దోచుకున్నారు. బుల్లితెరపై ఏ నటుడికీ లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లో కూడా సుధీర్‌కు ఫ్యాన్స్ ఉండటం విశేషం. ఇక, ఆయన పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాతో హీరోగా మారారు.
2022లో వచ్చిన గాలోడు సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. సుధీర్ ప్రస్తుతం ‘గోట్’ అనే సినిమాలో నటిస్తున్నారు. పాగల్ సినిమాకు దర్శకత్వం వహించిన కుప్పిలి నరేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గోట్‌లో సుధీర్ సరసన బ్యాచిలర్ సినిమా ఫేమ్ దివ్య భారతి నటిస్తున్నారు. ఇక, ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు.. హీరో, హీరోయిన్స్‌పై కొన్ని సీన్లను పూర్తి చేశారు.
ఫస్ట్ షెడ్యూల్‌కు సంబంధించిన ఫొటోలను సుధీర్ రెండు రోజుల క్రితం తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలపై స్పందిస్తున్న సుధీర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సుడిగాలి సుధీర్ ఓ వైపు టీవీ షోలు చేస్తూనే మరో వైపు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. తనకు లైఫ్ ఇచ్చిన బుల్లి తెరను మాత్రం వదలటం లేదు. మరి, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సుడిగాలి సుధీర్ మాస్ లుక్ ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.