సుడిగాలి సుధీర్.. ఈ పేరు తెలియని బుల్లి తెర ప్రేక్షకులు ఉండరు. మ్యాజిక్ చేసుకుని, చిన్న చిన్న క్యారెక్టర్లతో జీవనం సాగించిన ఈ కుర్రాడికి గుర్తింపు తెచ్చిందంటే జబర్థస్త్ షో అనే చెప్పాలి. ఈ షోలో చేసిన స్కిట్లతోనే కాదూ.. యాంకర్ రష్మీతో చేసిన రొమాన్స్ కారణంగా కూడా బాగా పాపులర్ అయ్యాడు. అయితే హీరోగా మారిన ఈ కుర్రాడు.. ఇప్పుడు కొత్త అప్ డేట్ ఇచ్చాడు.
సుడిగాలి సుధీర్.. ఈ పేరు తెలియని బుల్లి తెర ప్రేక్షకులకే కాదూ.. వెండితెర అభిమానులకు తెలుసు. మ్యాజిక్ చేసుకుని, చిన్న చిన్న క్యారెక్టర్లతో జీవనం సాగించిన ఈ కుర్రాడికి గుర్తింపు తెచ్చిందంటే జబర్థస్త్ షో అనే చెప్పాలి. ఈ షోలో చేసిన స్కిట్లతోనే కాదూ.. యాంకర్ రష్మీతో చేసిన రొమాన్స్ కారణంగా కూడా బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత యాంకర్‌గా మారి.. వ్యాఖ్యతగా తన సత్తాను చాటాడు. ఆ తర్వాత వెండితెరపైకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమా సాఫ్ట్ వేర్ సుధీర్ పర్వాలేదనిపించుకున్న ఈ విజయవాడ కుర్రాడు.. తర్వాత తన బుల్లితెర స్నేహితులు రామ్ ప్రసాద్, శ్రీనులతో కలిసి త్రీ మంకీస్‌లో నటించాడు.
ఆ తర్వాత గాలోడుతో హిట్ అందుకున్న సుధీర్..వాంటెడ్ పండుగాడుతో నిరాశపరిచాడు. దీంతో కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన బెక్కెం వేణుగోపాల్ నిర్మాత, పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వంలో ఓ సినిమాను చేయబోతున్నాను. కాగా, సుధీర్ పుట్టిన రోజు సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఆ టైటిల్ చూడటానికి ఫన్నీగా ఉంది. ఈ సినిమాకు గోట్ ( GOAT – గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్) అని టైటిల్ ఖరారు చేశారు. లక్కీ మీడియా, మహారాజా క్రియేషన్స్ బ్యానర్లపై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ల, బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. తమిళ నటి దివ్య భారతి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతలు చంద్రశేఖర్ రెడ్డి, బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఒక మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేస్తున్నామని, శరవేగంగా షూటింగ్ జరుగుతోందని, సుడిగాలి సుధీర్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ను ప్రకటించడం ఆనందంగా ఉందని అన్నారు.
‘గోట్’ టైటిల్ ప్రకటించిన కొన్ని నిమిషాల్లోనే ఆడియన్స్ నుంచి మంచి స్పందన రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ మంచి సంగీతం సమకూర్చారని.. తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి ప్రోత్సాహం లభిస్తుందని తాము ఆశిస్తున్నామని చెప్పారు. అలాగే డైరెక్టర్ చిత్ర దర్శకుడు నరేష్ కుప్పిలి మాట్లాడుతూ.. ఓ మంచి కాన్సెప్ట్‌తో కూడిన కథను తెర మీదికి తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీపడకుండా షూటింగ్ కోసం మేం ఏది అడిగితే అది సమకూరుస్తున్నారని, హీరో, హీరోయిన్ మాకు ఎంతగానో సహకరిస్తున్నారన్నారు. ఈ సినిమాను ఆదరించాలని ఆడియన్స్‌ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
— Sudigali Sudheer (@sudheeranand) May 19, 2023