చిత్రపరిశ్రమలో వరుస విషాదాలు అభిమానులను కలవరపెడుతున్నాయి. ఇటీవల నటుడు కొచ్చు ప్రేమన్ మరణవార్తను మరువకముందే మరో సెలబ్రిటీ మరణవార్త ఇండస్ట్రీని కుదిపేస్తోంది. హ్యాపీ డేస్, స్టార్ వార్స్, బ్లేడ్ రన్నర్, యంగ్ డాక్టర్స్ ఇన్ లవ్ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన నటుడు గ్యారీ ఫ్రైడ్‌కిన్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 70 ఏళ్ళు. కాగా.. గ్యారీ చనిపోయిన విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. గ్యారీ గత శుక్రవారం.. ఒహియోకి చెందిన యంగ్‌స్ టౌన్ ధర్మశాలలో చనిపోయినట్లు వారు తెలిపారు. అయితే.. గ్యారీ మృతికి COVID-19 కారణమని సమాచారం.
ఇక 1952లో యంగ్ స్టౌన్ లో జన్మించిన గ్యారీ.. 1981లో అండర్ ది రెయిన్‌బో మూవీ ద్వారా సినిమాల్లో అడుగుపెట్టాడు. గ్యారీ కెరీర్ లో ‘యంగ్ డాక్టర్స్ ఇన్ లవ్’ సినిమాలోని ‘డాక్టర్. మిల్టన్’ క్యారెక్టర్, హ్యాపీ డేస్ లో క్లారెన్స్ క్యారెక్టర్ లతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. అంతేగాక ‘ది ట్విలైట్ జోన్’, బ్లేడ్ రన్నర్, స్టార్ వార్స్: రిటర్న్ ఆఫ్ ది జెడి లాంటి సినిమాలెన్నో గ్యారీ కెరీర్ లో మంచి పేరు తీసుకొచ్చాయి. గ్యారీ చివరిసారిగా 2016లో వచ్చిన ‘మదర్స్ డే’ సినిమాలో నటించాడు. ఇక ఖాళీ టైంలో గ్యారీ ‘లిటిల్ పీపుల్ ఆఫ్ అమెరికా’లో యాక్టీవ్ మెంబెర్ గా అమెరికా అంతటా మీటింగ్స్ లో పాల్గొనేవాడు.
ఇదిలా ఉండగా.. గ్యారీ మరణంతో హాలీవుడ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. అతని ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు హాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ఇక గ్యారీ పేరుపై అతని అల్మా మేటర్, యంగ్‌స్ టౌన్ స్టేట్ లో స్కాలర్ షిప్స్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసింది. వైకల్యం లేదా ఫైన్ ఆర్ట్స్ లో ఇంటరెస్ట్ ఉన్న వారికి ఈ స్కాలర్ షిప్ లో మొదటి ప్రాముఖ్యత ఇవ్వబడుతుందని గ్యారీ సన్నిహితులు తెలిపారు.
Gary Friedkin, who appeared in the films Young Doctors in Love and Mother’s Day for director Garry Marshall, died Friday of complications from COVID-19 at a hospice facility in Youngstown, Ohio, his family announced. He was 70.https://t.co/pHwJXG4N7a
— Canadiansuds (@Canadiansuds1) December 9, 2022
🎬MOVIE HISTORY: 40 years ago today, July 16, 1982, the movie ‘Young Doctors in Love’ opened in theaters!#SeanYoung #MichaelMcKean #GaryFriedkin #KyleTHeffner #RickOverton #CrystalBernard #TedMcGinley @saulrubinek #HarryDeanStanton #HectorElizondo #PamelaReed #DabneyColeman pic.twitter.com/ksdRa762DD
— Film News Nostalgia (@FilmNewsNos) July 16, 2022