కొన్ని పాటలు ఉంటాయి. క్లాసిక్స్ లాంటివి! ఒరిజినల్ కంటే బాగా పాడగలం అనుకుంటేనే ట్రై చేయాలి. లేదంటే వాటిని అస్సలు టచ్ చేయకూడదు. మరీ ముఖ్యంగా తెలుగులోని బ్రేకప్ సాంగ్స్. ప్రస్తుతం అంటే అందరూ సిద్ శ్రీరామ్ మాయలో ఊగిపోతున్నారు కానీ ఒకప్పుడు కార్తిక్ పాడిన సాంగ్స్ విని ప్రేక్షకులు మెంటలెక్కిపోయేవారు. అందులో మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలోని సాంగ్స్ అయితే లూప్ మోడ్ లో పెట్టి వింటుంటారు. అలాంటి ఓ పాటని ఇప్పుడు సర్వనాశనం చేసేసినట్లు కనిపించారు! దీంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగులో ఈ మధ్య కాలంలో రియాలిటీ షోల ట్రెండ్ బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షో బాగా క్లిక్ అయింది. ఇందులో సీరియల్ నటీనటులతో పాటు మేల్, ఫిమేల్ యాంకర్స్, యాక్టర్స్, కమెడియన్స్ సందడి చేస్తూనే ఉంటారు. అయితే సుడిగాలి సుధీర్ ఉన్నప్పుడు.. ఈ షో బాగా నడిచేది. అతడు బయటకెళ్లిపోయిన తర్వాత రష్మీ యాంకర్ గా వచ్చింది. ఆ ఎఫెక్ట్ షోపై కాస్త పడినట్లు అనిపించింది. ఇప్పుడు సుధీర్ షోలోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు తాజాగా ఓ ప్రోమోని విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ లో హైపర్ ఆది ఎక్కడా కనిపించకపోవడం విశేషం.
ఇక ప్రోమో తల్లీ కూతుళ్లు అనే కాన్సెప్ట్ తో ఈసారి ఎపిసోడ్ ప్లాన్ చేశారు. అయితే ఓ సందర్భంలో నటి భాను.. పవన్ ‘తీన్ మాన్’ సినిమాలోని ‘గెలుపు తలుపులే..’ పాడింది. దీనికి ఇంద్రజ కూడా డెప్త్ తో పాడావని అభినందించింది. ఏదో కొత్తగా ట్రై చేయాలని ఆర్గనైజర్స్ భానుతో ఈ సాంగ్ పాడించారు కానీ అదే ఇప్పుడు ట్రోలింగ్ కి కారణమవుతోంది. మంగళవారం సాయంత్రం ఆ ప్రోమో రిలీజ్ కాగా.. అప్పటినుంచి భాను పాటపై నెటిజన్స్ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. వద్దు.. నువ్వు పాట పాడొద్దని లెక్కలేనన్ని మీమ్స్ చేస్తున్నారు. మరికొందరైతే.. ఇక ఈ పాట వినడం పూర్తిగా మానేస్తానని సెటైర్లు వేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే.. షో నిర్వహకులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టినట్లు అనిపిస్తోంది. మరి ఆమె సాంగ్ మీకెలా అనిపించింది. దిగువన కామెంట్ చేయండి.