బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా నటించిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ప్రమోషన్స్‌లో భాగంగా టీం షోలో పాల్గొన్నారు. శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సీనియర్ నటి సుహాసిని, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర తదితరులు నటించారు. ఆగస్టు 18న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
స్టార్ యాంకర్ సుమ హోస్ట్ చేసే షో అంటేనే ఆ హంగామా వేరే లెవల్లో ఉంటుంది. టీవీ షోస్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, సినిమా ఫంక్షన్స్, స్పెషల్ ఈవెంట్స్ ఆమె హోస్ట్ చేస్తుందంటే ఇక చెప్పక్కర్లేదు. సందర్భానికి తగ్గట్టు అప్పటికప్పుడు పంచ్‌లు వెయ్యాలంటే సుమ తర్వాతే ఎవరైనా. తన క్రేజ్ వల్లే కొన్ని షోస్ రన్ అవుతున్నాయి. ఇక సుమ హోస్ట్ చేసే వాటిలో ఆమె పేరు మీద వచ్చే ‘సుమ అడ్డా’ షో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఎంతోమంది సెలబ్రిటీలతో ఓ ఆట ఆడుకుని, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సుమ.. ఈ వారం ఎపిసోడ్లో ఎప్పటిలానే నవ్వుల పువ్వులు పూయించనుందని ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఈ పాపులర్ గేమ్ షో శనివారం (ఆగస్టు 5) ప్రోమో ఫన్‌తో పాటు ఎమోషనల్‌గా సాగింది.
బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా నటించిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ప్రమోషన్స్‌లో భాగంగా టీం షోలో పాల్గొన్నారు. శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సీనియర్ నటి సుహాసిని, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర తదితరులు నటించారు. ఆగస్టు 18న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వారం సోహెల్, ఆలీ రెజా, యాంకర్ దీప్తి, రూప కలిసి సందడి చేశారు. దీప్తి తమ విజయవాడ గురించి, సోహెల్ హైదరాబాద్ గురించి గొప్పలు చెప్తూ అలరించారు. ఇక ప్రెగ్నెంట్ అంటూ సుమ, సోహెల్‌ని ఆట పట్టించడం.. తిరిగి సోహెల్ కౌంటర్స్ ఇవ్వడం ఫన్నీగా అనిపించింది.
నవ్విస్తూనే, అందర్నీ కంటతడి పెట్టించాడు సోహెల్. తన కెరీర్లో ఎదుర్కొన్న ఒడిదుడుకులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ‘జీవితంలో ఎలా ముందుకెళ్లాలి? నన్ను యాక్సెప్ట్ చేస్తారా, లేదా? రియాలిటీ షో నుంచి, చిన్న స్క్రీన్ నుంచి వచ్చాడు.. భయమేస్తుంటుంది.. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడు చాలా మంది ఏందిరా వీడు తేడా గాడు అన్నట్లుగా మాట్లాడారు’ అంటూ కంటతడి పెట్టుకున్నాడు. దీంతో సుమతో సహా అందరూ ఎమోషనల్ అయ్యారు. ఎంటర్టైన్మెంట్, ఫీలింగ్స్ కలగలిసిన ‘సుమ అడ్డా’ లేటెస్ట్ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి : ఒకప్పడు దేశంలోనే రిచ్ హీరో.. చివరకు మురికివాడలో