సినిమా రంగంలోని 24 శాఖల్లో ఏ విభాగంలో పని చేసే వారైనా సరే తమ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని, తామున్న ఫీల్డ్‌లో టాప్ ప్లేస్‌లో ఉండాలని ఆరాట పడుతుంటారు. అందుకు తగ్గట్టే కష్టపడుతుంటారు కూడా.
సినిమా రంగంలోని 24 శాఖల్లో ఏ విభాగంలో పని చేసే వారైనా సరే తమ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని, తామున్న ఫీల్డ్‌లో టాప్ ప్లేస్‌లో ఉండాలని ఆరాట పడుతుంటారు. అందుకు తగ్గట్టే కష్టపడుతుంటారు కూడా. కాకపోతే జాగ్రత్త పడకపోవడం అనే ఒకే ఒక్క కారణంతో జీవితాన్ని అగాధంలోకి నెట్టేసుకుని, అర్థాంతరంగా ముగించి వారు ఎందరో ఉన్నారు. వారిలో ఇప్పటి తరానికి పెద్దగా తెలియని స్టార్ ఒకరున్నారు. ఆయనే భగవాన్ అభాజీ పలావ్ (Bhagwan Abhaji Palav). ముద్దుగా భగవాన్ దాదా అని పిలిచేవారు. హిందీ చిత్ర సీమలో నటుడు, దర్శకుడిగా తనదైన ముద్ర వేశారాయన.
సినిమాల్లోకి రాకముందు ఓ క్లాత్ మిల్లులో పని చేశారు భగవాన్. ఎప్పటికైనా చిత్ర పరిశ్రమలోకి రావాలనే కోరికతో ఇండస్ట్రీ గురించి క్షుణ్ణంగా అన్ని విషయాలు తెలుసుకున్నారు. 1938లో ‘బహదూర్ కిసాన్’ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసి, అనుభవం గడించాక తక్కువ బడ్జెట్లో సినిమాలు తియ్యాలని డిసైడ్ అయ్యారు. 1951లో రాజ్ కపూర్ సలహాతో.. భగవాన్ హీరో కమ్ డైరెక్టర్‌గా ‘అల్బెలా’ చేసి సక్సెస్ అయ్యారు. సినిమాల పట్ల ఆసక్తే ఆయనకు అన్ని రంగాల మీద పట్టు సాధించేలా చేసింది. నిర్మాతగానూ మారి లవ్, యాక్షన్ ఫిలింస్ చేశారు. దేశంలోనే రిచెస్ట్ హీరోగా పేరు ప్రఖ్యాతులు గడించారు.
సూపర్ హిట్ సినిమాలతో పేరుకు పేరు, డబ్బుకు డబ్బు వచ్చింది. అలా ఒకేసారి స్టార్డమ్, స్టేటస్ రావడంతో విలాసాలకు విపరీతంగా డబ్బు ఖర్చు చేసేవారు. ముంబై జుహూ ప్రాంతంలో 25 గదులు గల పెద్ద బంగ్లా కొని అందులో నివసించేవారు. వారంలో ఏడు రోజులు, రోజుకో కారు చొప్పున లగ్జరీ కార్లలతో తిరగేవారు. ఆయన తీరు చూసి ఇండస్ట్రీ వర్గాల వారు సైతం ఆశ్చర్యపోయేవారు. కట్ చేస్తే.. కొద్ది కాలానికి సీన్ రివర్స్ అయ్యింది. భగవాన్ సినిమాలకు ఆదరణ తగ్గిపోయింది. 1960 నుంచి హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టు స్థాయికి పడిపోయారు.
దీంతో పాటు మెల్లగా అవకాశాలు లేకపోయాయి. చూస్తూ ఉండగానే ఆస్తి అంతా హారతి కర్పూరంలా కరిగిపోయింది. ఆర్థిక అవసరాల కోసం ఒక్కో కారును, ఇంటిని, చివరకు భార్య నగలను కూడా అమ్మేశారు. మురికివాడలో జీవనం సాగించారు. 89 ఏళ్ల వయసులో గుండె పోటుతో మరణించారు. 2016లో భగవాన్ దాదా జీవితం ఆధారంగా మరాఠీలో ‘ఏక్ అల్బెలా’ అనే బయోపిక్ రూపొందింది. సామాన్యుడి స్థాయి నుంచి సెలబ్రిటీగా మారిన భగవాన్ చివరకు అత్యంత దయనీయ స్థితిలో కన్నుమూశారు.
ఇది కూడా చదవండి : ‘నిరీక్షణ’ హీరోయిన్ అర్చన ఇప్పుడేం చేస్తుందో తెలుసా?