తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎంతో మంది అలనాటి నటీమణులు కొంత విరామం తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యంగా ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో పని చేసిన ఇతర భాషల వారికి ఎక్కువగా అవకాశాలొస్తున్నాయి.
తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎంతో మంది అలనాటి నటీమణులు కొంత విరామం తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యంగా ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో పని చేసిన ఇతర భాషల వారికి ఎక్కువగా అవకాశాలొస్తున్నాయి. నదియా, ఖుష్బు, టబు.. ఇలా చాలా మంది కథానాయికలు అమ్మ, అత్త, వదిన వంటి పాత్రలతో అలరిస్తున్నారు. కథానాయికగా ఉన్నప్పటి కంటే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాకే మరింత బిజీ అయిపోయిన వారూ ఉన్నారు. ఇప్పుడు ఓ అచ్చ తెలుగు అందాల నటి, తెలుగు వారి మనసు దోచుకున్న నటి చాలా కాలం తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తిరిగి వస్తున్నారు. దీంతో సినీ పరిశ్రమ వారు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురవుతూ ఆమె గురించిన వివరాలు తెలుసుకుంటున్నారు.
భాను చందర్ హీరోగా బాలు మహేంద్ర తీసిన ఎవర్ గ్రీన్ రొమాంటిక్ ఫిలిం ‘నిరీక్షణ’ తో తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అర్చన. కృష్ణాజిల్లాలో పుట్టారామె. అసలు పేరు సుధ. చిన్నప్పుడే పేరెంట్స్ మద్రాసుకి షిఫ్ట్ అయిపోయారు. దీంతో 1980లో తమిళ సినిమాతోనే కెరీర్ స్టార్ట్ చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఒడియా, బెగాలీ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నటించారు. ‘మీనాక్షి పొన్నుంగా’ అనే కోలీవుడ్ టీవీ సీరియల్‌లోనూ కనిపించారు. ‘నిరీక్షణ’ గిరిజన యువతిగా ఆమె చేసిన క్యారెక్టర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ సినిమాకి నంది (స్పెషల్ జ్యూరీ) అందుకున్నారు. ‘లేడీస్ టైలర్’, ‘దాసీ’ వంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు.
తర్వాత భాను చందర్, అర్చనలతో బాలు మహేంద్ర తీసిన ‘వీడు’ చిత్రానికి నేషనల్ అవార్డ్‌తో పాటు ఫిలింఫేర్ కూడా అందుకున్నారు. ‘దాసి’ కి మరోసారి జాతీయ ఉత్తమ నటిగా అవార్డ్ గెలుచుకున్నారు. తర్వాత పలు భాషల్లో నటించి అర్చన కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. తెలుగు ఆడియన్స్, మూవీ లవర్స్ ఆమె మళ్లీ నటిస్తే బాగుండు అని అనుకుంటూ ఉండే వారు. ఇప్పుడు ‘షష్ఠిపూర్తి’ అనే చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవల ఆమె పుట్టనరోజు సందర్భంగా మూవీ టీం పోస్టర్ రిలీజ్ చేస్తే కానీ ఈ విషయం బయటకు రాలేదు. ఇన్నాళ్లకు అర్చన మళ్లీ నటిస్తున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి : ఈ ఫోటోలో ఉన్న నటి ఎవరో గుర్తు పట్టారా?