మణిరత్నం దర్శకత్వంలో శోభిత దూళిపాళ్ల నటించిన పొన్నియన్ సెల్వన్-2 ఇటీవల విడుదల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి విదితమే. అంతకముందు ఓ వెబ్ సిరీస్‌లో గ్లామరస్ పాత్రలో కనిపించి చర్చనీయాంశమయ్యారు. ఆమె సినిమా కెరీర్ మొదలైన నాటి నుండి శోభితపై రూమర్లు చక్కర్లు కొట్టాయి. దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఇటీవల ఎక్కువగా రూమర్లు, గ్లామరస్ షో, సినిమాలతో వార్తలతో నిలుస్తున్నారు శోభిత ధూళిపాళ్ల. మణిరత్నం దర్శకత్వంలో ఆమె నటించిన పొన్నియన్ సెల్వన్-2 ఇటీవల విడుదల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి విదితమే. అంతకముందు ఓ వెబ్ సిరీస్‌లో గ్లామరస్ పాత్రలో కనిపించి చర్చనీయాంశమయ్యారు. ఆమె సినిమా కెరీర్ మొదలైన నాటి నుండి శోభితపై రూమర్లు చక్కర్లు కొట్టాయి. గూఢచారి, మేజర్ సినిమాలతో నటించిన సమయంలో ఆ సినిమా హీరో అడవి శేష్ , ఆమె మధ్య ఏదో నడుస్తుందటూ వార్తలు వచ్చాయి. అదీ కాస్తా అయిపోయాక.. మరో నటుడు నాగ చైతన్యతో డేటింగ్ అంటూ వార్తలు వచ్చాయి. వీరిద్దరూ లండన్ వెళ్లారని, రెస్టారెంట్ కనిపించారంటూ సోషల్ మీడియాలో వీరి ఫోటోలు వైరల్‌గా మారాయి. అయితే దీనిపై ఎప్పుడు స్పందించలేదు. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆమె క్లారిటీ ఇచ్చినట్లు కనిపిస్తుంది.
హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమెను యాంకర్ కొన్ని ప్రశ్నలు సంధించింది. సోషల్ మీడియాపై చాలా రూమార్లు వస్తాయని , వాటిని మీరెలా హ్యాండిల్ చేస్తారన్న ప్రశ్నకు ‘నా గురించి అంతగా అటెన్షన్ వచ్చే రూమర్ లేదు. అదృష్టవశాత్తు ఇప్పటివరకూ మంచి చిత్రాల్లో నటించాను. చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. నేను క్లాసికల్ డ్యాన్సర్‌ని. మణిరత్నం వంటి గొప్ప దర్శకుడి సినిమాలో రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్‌లో నాలుగు పాటలకు డ్యాన్స్ చేసే అవకాశం వచ్చింది. ఇన్ని ప్రత్యేకమైన విశేషాలు ఉన్నప్పుడు ఒకరో ఇద్దరో తెలిసీ తెలియక ఏదో మాట్లాడినంత మాత్రాన దాన్ని పట్టించుకుని, అంత ఫీలైపోవాల్సిన అవసరం లేదు’అని సమాధానమిచ్చారు.
ఈ రూమర్ నా గురించి ఎందుకు రాశారు.. క్లారిఫై చేయాలనుకున్నారా, దానికి తగినంత సమయం లేదా అన్న ప్రశ్నకు కూడా ఆమె సమాధానమిచ్చారు. ‘ఏ సంబంధం లేదు, ఏం తప్పు చేయనప్పుడు.. అదేదో అర్జంటుగా వెళ్లి చెప్పాలన్న తపన నాకు లేదు. ఏం తప్పు చేయనప్పుడు.. జీవితంపై దృష్టి సారించాలి. నా పని చేసుకుంటూ పోతున్నాను. మంచి వ్యక్తిగా ఉంటూ.. కామ్ గా ఉంటూ, ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. నా ఫోకస్ అంతే’ అంటూ తనపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టేందుకు ప్రయత్నించారు.