సింగర్ సునీత గురించి అటు సినీ అభిమానులకు, ఇటు టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాదాపు 20 ఏళ్లుగా తన మధురమైన గాత్రంతో సునీత.. సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. అయితే.. రెండో పెళ్లి తర్వాత సునీత తన వైవాహిక జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎల్లప్పుడూ ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది.
ఇక తాజాగా సునీతకు సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తన పెంపుడు కుక్కతో ఆటాడుకుంటూ.. సునీత వీడియోలో కనిపించారు. ఇదిలా ఉండగా.. సునీత ప్రస్తుతం ‘పాడుతా తీయగా’ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. మరి సునీత పెంపుడు కుక్కతో ఆటాడుకున్న వీడియో పై నెటిజన్లు స్పందిస్తూ.. పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరి సునీత లేటెస్ట్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.