రాధా ప్రశాంతి.. సీనియర్ నటి. ‘పరువు ప్రతిష్ట’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి తెలుగులో చాలా సినిమాలు చేశారు. కొన్నేళ్లపాటు కెరీర్ సాఫీగా సాగినప్పటికీ, ఆ తర్వాత అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. అయితే.. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా కంటిన్యూ అవుతున్న కాస్టింగ్ కౌచ్ పై ఆమె స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పుడు లేదు చెప్పండి. అప్పుడూ ఉంది .. ఇప్పుడూ ఉంది .. ఇక ముందు కూడా ఉంటుంది. అప్పట్లో ఎవరి తిప్పలు వారు పడేవారు కానీ బయటికి పబ్లిసిటీ చేసుకోలేదు. ఇప్పుడు ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ రోడ్డెక్కుతున్నారు అంతే.
ఇక్కడ ఎవరూ ఎవరినీ బలవంతం చేయరు.. ఎవరి ఇష్టం వారిది. కాస్టింగ్ కౌచ్ ఉండటం వల్ల నా కెరీర్ లో చాలా అవకాశాలు కోల్పోయాను. నన్ను తమ సినిమాల్లోకి పెట్టుకుని మళ్లీ తీసేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక్కసారి నన్ను సెకండ్ హీరోయిన్ గా తీసుకుని.. మేనేజర్ తో కమిట్మెంట్ అడిగించారు. అందుకు నేను ఒప్పుకోకపోతే ఆ సినిమా నుండి నన్ను తీసేశారు. ఆ తర్వాత ఓకే అన్నవారిని పెట్టుకున్నారు. కెరీర్ లో ఈ విధంగా బాధపడిన సంఘటనలు చాలానే ఉన్నాయి” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాధా ప్రశాంతి మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.