రెజీనా కాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే తనకు సినీ పరిశ్రమలో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చింది.
శివ మనసులో శృతి (SMS) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి రెజీనా. మొదటి సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకు గాను బెస్ట్ ఫిమేల్ యాక్టర్ గా సైమా అవార్డ్ లభించింది. ఈ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పవర్, రారా కృష్ణయ్య, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాలు చేసి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సినిమాలు చేస్తునే ఓటీటీ వెబ్ సిరీలస్ లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తాజాగా కోలీవుడ్లో ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న రెజీనా.. కాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
రెజీనా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. ” నా సినీ కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం కొందరిని సంప్రదించాను. దాంతో ఓ వ్యక్తి నాకు ఫోన్ చేసి సినిమాలో అవకాశం ఇస్తాను అన్నాడు. కానీ దానికి ముందు నువ్వు కమిట్ మెంట్ ఇవ్వాలి అని కండిషన్ పెట్టాడు. ఇది జరిగి 10 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి నా వయసు 20 సంవత్సరాలు మాత్రమే. నాకు ఏం అర్థం కాలేదు. అతని మాటల పట్ల నాకు సరైన అవగాహన లేదు. కమిట్ మెంట్ అంటే నాకు తెలిసేది కాదు. నేను రెమ్యునరేషన్ విషయంలో అడుగుతున్నారేమో అనుకున్నా. నా మేనేజర్ నీతో మాట్లాడతాడు అని ఫోన్ కట్ చేశాను. తర్వాత మేనేజర్ ద్వారా అసలు విషయం తెలిసింది. ఆ కాల్ చేసిన వ్యక్తి నా దగ్గర నుంచి వేరే ఏదో ఆశిస్తున్నాడని అర్థమైంది. అప్పుడు నాకు చాలా బాధ కలిగింది.
ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఉండేది. ఆ తర్వాత మళ్ళీ అలాంటి అనుభవం ఎదురుకాలేదు. అయితే కొందరు మాత్రం నటీమణులు ఇలాంటి ఘటనలు ఎదుక్కోవాల్సి వస్తుంది. కొంత మంది నిజం చెప్పవచ్చు, మరి కొంత మంది అబద్ధం చెప్పవచ్చు. అలాగే ఫేమ్ కావడానికి కూడా కొందరు అబద్ధాలు చెప్తారు”. అంటూ చెప్పుకొచ్చింది. సినీ ఇండస్ట్రీలో అమ్మాయిలు హీరోయిన్స్ గా కెరీర్ సాగించడం అనేది ఎంతో క్లిష్టమైంది. నటిగా పరిశ్రమలో నెట్టుకురావాలంటే ఎన్నో ఒడిదుడుకులను, ఊహించని పరిణామాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అదీగాక ఎప్పటినుండో ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే.. అది కాస్టింగ్ కౌచ్ అని చెప్పాలి.