సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తే వెంటనే సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి సెలబ్రేషన్స్ జరుపుతుంటారు దర్శకనిర్మాతలు. ఇదేం కొత్తగా వచ్చిన ఆనవాయితీ కాదు. సక్సెస్ మీట్ కి ఎవరు ఎలా వచ్చినా.. అందరి దృష్టి ముందుగా హీరోహీరోయిన్స్ వైపే వెళ్తుంది. అందులోనూ ముఖ్యంగా హీరోయిన్స్ పై ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు.
సాధారణంగా సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తే వెంటనే సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి సెలబ్రేషన్స్ జరుపుతుంటారు దర్శకనిర్మాతలు. ఇదేం కొత్తగా వచ్చిన ఆనవాయితీ కాదు. ఎన్నాళ్ళుగానో సినిమా విజయాన్ని టీమ్ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే.. సక్సెస్ మీట్ కి ఎవరు ఎలా వచ్చినా.. అందరి దృష్టి ముందుగా హీరోహీరోయిన్స్ వైపే వెళ్తుంది. అందులోనూ ముఖ్యంగా హీరోయిన్స్ పై ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు. సక్సెస్ మీట్ కదా.. హీరోయిన్స్ ఎలాంటి కట్టుబొట్టుతో వస్తారు? ట్రెండీగా గ్లామరస్ డ్రెస్సింగ్ స్టైల్ తో వస్తారా లేక చక్కగా చీరకట్టుతో వచ్చి ఆకట్టుకుంటారా? అని చూస్తుంటారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా.. సక్సెస్ మీట్ అయినా చక్కని కట్టుబొట్టుతో హాజరయ్యే హీరోయిన్స్ ని ఈ మధ్యకాలంలో అరుదుగా చూస్తున్నాం. ఆ విషయంలో నూటికి నూరు మార్కులు సంపాదించుకుంటోంది హీరోయిన్ సంయుక్త మీనన్. ఈ మలయాళం బ్యూటీ.. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు డెబ్యూ చేసి.. బింబిసారతో మొదటి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు తాజాగా ధనుష్ సరసన సార్ సినిమా చేసి హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇప్పుడంతా సంయుక్త గురించే మాట్లాడుకుంటున్నారు. సార్ సినిమా సక్సెస్ అయినందుకో.. లేక ఆమె అందం గురించో కాదు. ఎంతో చక్కగా మెయింటైన్ చేస్తున్న కట్టుబొట్టు గురించి.
ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా.. సక్సెస్ మీట్ అయినా సంయుక్తకి ఒకటే. ఆమె చక్కని నడవడికను మాత్రం వీడట్లేదు. ఇటీవల సక్సెస్ మీట్స్ లో హీరోయిన్స్ ఇలా రావడం చూడలేదు. నిండుగా చీరకట్టుతో.. నుదుటిన అందమైన బొట్టుతో.. చక్కగా.. ఎంతో చూడముచ్చటగా సంయుక్త.. ఈ తరం హీరోయిన్స్ కి ఆదర్శంగా నిలుస్తోంది. ఓవైపు ఇండస్ట్రీలోకి వచ్చామా.. ఇన్ని సినిమాలు చేశామా.. గ్లామర్ షో చేసి అవకాశాలు కొట్టేసి.. రెమ్యూనరేషన్స్ పెంచేసి నాలుగు రాళ్లు వెనకేసుకున్నామా? అంటూ హీరోయిన్స్ కమర్షియల్ గా ఆలోచిస్తున్నారు. కానీ.. సంయుక్త మాత్రం కూల్ అండ్ స్టడీ అన్నట్లుగా గ్లామర్ కి ప్రాధాన్యత ఇవ్వకుండా పాత్రలకు ఏమేం అవసరం అనేది చూసుకుంటూ.. ఆయా సినిమాలలో ఆమె పోషించిన పాత్రలను స్టేజ్ పై రిఫ్లెక్టు చేస్తోంది. మరి ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైనే చేరుకున్నదా? అంటూ కేకే రాసిన లిరిక్స్.. సీతకంటే సంయుక్తకే బాగా నప్పేలా ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి సంయుక్త కట్టుబొట్టు గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.