స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’. మైథలాజికల్ డ్రామా జానర్ లో దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాని తెరకెక్కించారు. కాళిదాసుడు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా.. శకుంతల – దుశ్యంతుడి లవ్ స్టోరీ నేపథ్యంలో సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. కాగా.. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమాని నీలిమ గుణ నిర్మించారు. ఫిబ్రవరి 17న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. టైటిల్ రోల్ లో సమంత నటించగా.. దుశ్యంత రాజు పాత్రను దేవ్ మోహన్ పోషించారు. ఇందులో కీలకపాత్ర అయిన దుర్వాస మహర్షి పాత్రలో మోహన్ బాబు నటించారు.
ఇక రిలీజ్ కి దగ్గరపడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ ని ట్రైలర్ తో మొదలుపెట్టారు మేకర్స్. మరి మైథలాజికల్ డ్రామా అంటే.. ఖచ్చితంగా ఆకట్టుకునే విజువల్స్.. సంగీతం.. పవర్ ఫుల్ క్యారెక్టర్స్ అన్నీ ఎక్సపెక్ట్ చేస్తారు ప్రేక్షకులు. ఈ క్రమంలో శాకుంతలం నుండి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే.. గుణశేఖర్ చివరి సినిమా ‘రుద్రమదేవి'(2015) హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో వచ్చింది. ఆ సినిమా తర్వాత దాదాపు ఏడేళ్లకు శాకుంతలం సినిమాని సిద్ధం చేశారు గుణశేఖర్. ఇటీవల సమంత కూడా యశోద మూవీతో మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో పాపులర్ శకుంతల లవ్ స్టోరీని తెరపైకి తీసుకొస్తుండటం ఆడియెన్స్ కి ఇంటరెస్ట్ కలిగించే పాయింట్.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. శకుంతల పుట్టుకను పరిచయం చేస్తూ.. ఆమె ఎదుగుదల.. దుశ్యంత రాజుతో పరిచయం, ప్రేమాయణం చెబుతూ చూపించారు. దుర్వాస మహర్షి, మేనకలకు జన్మించిన శకుంతల.. కణ్వ మహర్షి ఆశ్రమంలో పెరుగుతుందని.. దుశ్యంతుడితో ప్రేమలో పడ్డాక శకుంతల ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసింది? అనేక మలుపులు, అవమానాల మధ్య తన దుశ్యంతుడి ప్రేమను ఎలా పొందింది? అనే పాయింట్ ఆఫ్ వ్యూలో శాకుంతలం మూవీ ట్రైలర్ ని ప్రెజెంట్ చేశారు గుణశేఖర్. అయితే.. దుశ్యంతుడు పాలించే రాజ్యం.. శకుంతల పెరిగిన వాతావరణం, లవ్ ట్రాక్.. విజువల్స్ తో పాటు మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా హైలైట్ అయ్యాయి.
ఈ ట్రైలర్ లో వాయిస్ ఓవర్ ని సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ అందించారు. కాగా.. శాకుంతలం ట్రైలర్ చివరిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ.. శకుంతల కుమారుడు భరతుడి క్యారెక్టర్ లో ఎంట్రీ ఇవ్వడం విశేషం. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా.. మరి మైథలాజికల్ డ్రామాలలో బెస్ట్ రిజల్ట్ అందుకుంటుందేమో చూడాలి. ట్రైలర్, విజువల్స్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని చెప్పాలి. ఆల్రెడీ హిట్ కొట్టి ఫామ్ లో ఉన్న సమంత.. శకుంతలగా మరో హిట్ నమోదు చేస్తుందేమో చూడాలి. దర్శకుడు గుణశేఖర్ కూడా సినిమాపై ఏళ్ళ సమయాన్ని వెచ్చించారు. మరి శాకుంతలం ట్రైలర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.