సమంత ప్రస్తుతం సిటడెల్ ఇండియా అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఫ్యామిలీ మ్యాన్ 2 దర్శకులు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.
సౌత్ క్వీన్ సమంత నటిస్తున్న ‘సిటడెల్ ఇండియా’ వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇంగ్లీష్‌లో విజయవంతం అయిన ఈ స్పై సిరీస్‌ను ఇండియాకు తగ్గట్లు మార్పులు చేసి, రీమేక్ చేస్తున్నారు. ఇంగ్లీష్‌లో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించారు. ఇక, ‘సిటడెల్ ఇండియా’లో సమంత, వరుణ్ ధావన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సిరీస్ కోసం సినిమా ప్రియులు, సమంత అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక, అసలు విషయానికి వస్తే.. సిటడెల్ సిరీస్ కోసం సమంత షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకున్నారట.
ఈ సిరీస్ కోసం ఆమె 10 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తల్లో నిజం ఎంతుందో.. నిర్మాతలకు.. ఆ మొత్తం తీసుకున్న సమంతకే తెలియాలి. ఒక వేళ ఇదే గనుక నిజం అయితే.. సమంత స్టార్డమ్ ఏ మేరకు పెరిగిపోయిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇంత మొత్తం డబ్బులు తీసుకోవటం ఓ గొప్ప విషయమే. ఆ గొప్పను సమంత సాధించారు. ఇక, సిటడెల్ సిరీస్‌కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.
గతంలో వీరి దర్శకత్వంలో సమంత ఫ్యామిలీ మ్యాన్ 2లో నటించారు. ఈ వెబ్ సిరీస్ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఓటీటీ రికార్డులు క్రియేట్ చేసింది. కాగా, సమంత తాజా చిత్రం శాకుంతలం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ సంగతి తెలిసిందే. 80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మరి, సిటడెల్ కోసం సమంత ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుందన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.