ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అంటూ తెలుగు ప్రేక్షకులతో సహా యావత్ సినీ ప్రేక్షకులను ఊపేసన సాంగ్ ఇది. పుష్ప సినిమాకి ఎంత క్రేజ్ వచ్చిందో ఆ సినిమాలో దేవీశ్రీ మ్యూజిక్ కి బన్నీ- సమంత స్టెప్పులకు అంతకు మించిన క్రేజ్ వచ్చింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో రీల్స్, షేర్ చాట్, మోజ్ వంటి యాప్స్ ఈ పాట సందడి చేస్తూనే ఉంటుంది. అలాంటి ఈ బీట్ కు సమంతతో కలిసి అక్షయ్ కుమార్ కాలు కదిపాడు.
అల్లు అర్జున్ స్టైల్ లో సమంతతో కలిసి అక్షయ్ కుమార్ మాస్ స్టెప్పులతో అదరగొట్టాడు. బాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ షోగా పేరు గాంచిన కాఫీ విత్ కరణ్ షోకి హాజరైన అక్షయ్– సామ్ ఆ షోలో సందడి చేశారు. కరణ్ జోహార్ అడిగే ప్రశ్నలకు సమదైనశైలిలో ఫన్నీ ఆన్సర్స్ ఇస్తూ ఆకట్టుకున్నారు. ఆ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్లు విడుదల చేశారు.
It’s F̶i̶l̶t̶e̶r̶ Coffee ☕️ without the filters when these two superstars grace the Koffee couch in the latest episode of #HotstarSpecials #KoffeeWithKaran season 7.#HotstarSpecials #KoffeeWithKaranS7 episode 3 streaming on 21st July. pic.twitter.com/qVhgAgLOjG
— Disney+ Hotstar (@DisneyPlusHS) July 20, 2022
ఆ ప్రోమోలో అక్షయ్ కుమార్- సమంతతో కలిసి ఊ అంటావా సాంగ్ కు స్టెప్పులేశాడు. ఆ వీడియోకి ద కూల్ అండ ది కిల్లర్.. హౌస్ లో టెంపేరచర్స్ పెంచేస్తున్నారు అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇటీవలే పృథ్వీరాజ్ సినిమాతో హిట్ కొట్టిన అక్షయ్ తర్వాత సమంతతో కలిసి ఓ సినిమా చేయనున్నాడు. సమంత శాకుంతలం, యశోద, ఖుషీ వంటి సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. సమంత- అక్షయ్ కుమార్ మాస్ స్టెప్పులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The Cool 😎 and the Killer 🔥 raising temperatures in the house! #HotstarSpecials #KoffeeWithKaranS7 episode 3 starts streaming on 21st July. @karanjohar @akshaykumar @Samanthaprabhu2 @apoorvamehta18 @aneeshabaig @jahnvio @Dharmatic_ pic.twitter.com/QMXB0KBwab
— Disney+ Hotstar (@DisneyPlusHS) July 20, 2022