సినీ ఇండస్ట్రీలో అభిమాన సెలబ్రిటీలకు సంబంధించి ఏ విషయమైనా తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు ఫ్యాన్స్. అయితే.. సెలబ్రిటీల సినిమాల అప్ డేట్స్ విని సంతోషించేవారు.. వారి పర్సనల్ లైఫ్ గురించి ఏ చిన్న వార్త నెగటివ్ గా వినిపించినా బాధపడిపోతారు. అయితే.. మొన్నటివరకు ఎంతోమందికి రోల్ మోడల్ గా నిలిచిన ఓ టాలీవుడ్ సెలబ్రిటీలు నాగచైతన్య, సమంత. గతేడాది సపరేట్ అయిపోయి ఎవరి కెరీర్ వారు లీడ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం అటు నాగచైతన్య, ఇటు సమంత చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా వీరు గతంలో కొనుక్కున్న ఇల్లుకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో నాగచైతన్య పెళ్లయ్యాక ఎంతో ఇష్టంగా హైదరాబాద్ లో ఓ ఇల్లు కొనుగోలు చేశాడు. దీనికి ఎంతో కష్టపడి సీనియర్ నటుడు మురళీ మోహన్ ను ఒప్పించి, ఆయన నుండి ఆ ఇంటిని కొనుగోలు చేశారు. ఇక్కడవరకు అంతా బాగానే ఉన్నా.. తర్వాత కాలంలో సామ్ – చై వివిధ కారణాలతో విడిపోయారు. మరి.. ఎంతో ఇష్టంగా మురళి మోహన్ దగ్గర కొన్న ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు అంటే ఓ ఆసక్తికర విషయం బయటకి వచ్చింది.
తాజాగా మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు నిజాన్ని బయటపెట్టారు. ‘సమంత- చైతు నా దగ్గర హౌస్ కొన్నాక..
ఆ ఇంట్లోనే ఉంటూ వచ్చారు. అయితే.. తర్వాత వాళ్లు ఓ ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కొని షిఫ్ట్ అవ్వాలి అనుకున్నారు. అందుకోసం నా దగ్గర కొన్న ఫ్లాట్ ని అమ్మేశారు. అయితే.. ఆ ఇండిపెండెంట్ హౌస్ రెడీ అయ్యేవరకు ఇదే ఇంట్లో ఉండటానికి ముందుగానే అంగీకారం ఏర్పరుచుకున్నారు. కానీ.. అంతలోనే వారు విడిపోవడంతో కథ మొదటికి వచ్చింది. తాము అమ్మేసిన ఇంటినే.. సమంత ఇదివరకంటే ఎక్కువ ధర చెల్లించి, మళ్ళీ కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఆమె, తన తల్లితో అక్కడే ఉంటుంది’ అని మురళీ మోహన్ తెలిపారు. సో.. సమంత తన ఇంటికి తానే ఎదురు డబ్బులు కట్టినట్టు అయ్యింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.