స్టార్ హీరోయిన్ సమంత సినిమాల నుండి బ్రేక్ తీసుకుంటుందని తెలియగానే ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇండస్ట్రీ వర్గాల వారిలో సామ్ టాపిక్ హాట్ టాపిక్ అయ్యింది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న సమంత సినిమాల నుండి ఏడాది పాటు లాంగ్ గ్యాప్ తీసుకోబోతుంది.
స్టార్ హీరోయిన్ సమంత సినిమాల నుండి బ్రేక్ తీసుకుంటుందని తెలియగానే ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇండస్ట్రీ వర్గాల వారిలో సామ్ టాపిక్ హాట్ టాపిక్ అయ్యింది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న సమంత సినిమాల నుండి ఏడాది పాటు లాంగ్ గ్యాప్ తీసుకోబోతుంది. షూటింగ్ దశలో ఉన్నవి కాకుండా కొత్తగా కమిట్ అయిన ఫిలింస్ క్యాన్సిల్ చేసుకుంటుంది. ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చి తన డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న నిర్మాతలను పిలిపించి వారి డబ్బు తిరిగిచ్చేసిందట. మయోసైటిస్ బారిన పడడంతో సమంత షెడ్యూల్స్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. తన ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం ‘యశోద’ ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొనలేక పోయింది. ‘శాకుంతలం’ అప్పుడు అతి కష్టం మీద బయటకు వచ్చింది. కాస్త ప్రమోషన్స్ అవీ చేసింది కానీ మళ్లీ విశ్రాంతి తీసుకుంది.
హిందీలో చేస్తున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కంప్లీట్ అయిపోయింది. విజయ్ దేవరకొండ పక్కన నటిస్తున్న ‘ఖుషి’ కూడా సామ్ కారణంగానే ఆలస్యమైంది. ఎట్టకేలకు రీసెంట్గా షూట్ కంప్లీట్ చేసింది. ఒకవేళ సమంత కనుక ఈ వ్యాధి బారిన పడకుండా ఉండుంటే తన ప్రొఫెషనల్ లైఫ్ మరోలా ఉండేది. బాలీవుడ్లో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూనే.. ‘పుష్ప’ తో వచ్చిన పాన్ ఇండియా స్టార్‌డమ్‌ని కంటిన్యూ చేసేది. హాలీవుడ్ డెబ్యూ ఇచ్చేది. కట్ చేస్తే మయోసైటిస్ మరింత ఇబ్బంది పెడుతుండడంతో కొంత కాలం చికిత్స తీసుకుని, పూర్తి ఆరోగ్యంతో కోలుకుని, తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తనకు అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని, హెల్త్ ఇష్యూస్ వల్ల నటించలేకపోతున్నానని సారీ చెప్పి, ఎవరి అడ్వాన్స్ వారికి వెనక్కి ఇచ్చేస్తుంది.
ఇలా ఓ మూడు బిగ్ ప్రొడక్షన్ హౌసెస్‌కి అడ్వాన్స్ వెనక్కి ఇచ్చెయ్యడం ద్వారా సమంత భారీగానే నష్టపోయిందని తెలుస్తుంది. సినిమాకి రూ.3 నుంచి 4 కోట్ల వరకు తీసుకునే సామ్.. అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేయడంతో దాదాపు రూ.10 నుంచి 12 కోట్ల వరకు నష్టపోయినట్టుగా తెలుస్తుంది. తన ఆరోగ్య పరిస్థితుల కారణంగా కొంత గ్యాప్ తీసుకుని పూర్తిగా కోలుకున్న తర్వాత కొత్త ప్రాజెక్టులు అంగీకరిస్తుందని సమాచారం. సంవత్సరానికి 5, 6 చిత్రాల్లో కనిపించే సమంత.. కొన్నాళ్ల పాటు వెండితెరపై కనిపించదనే సరికి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇటీవల కాలంలో ఎక్కువగా పలు ప్రాముఖ్యమైన ఆలయాలను దర్శిస్తూ, ఆ ఫోటోలు, మోటివేషన్ కోటేషన్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే.