తెలుగు ఇండస్ట్రీలో ఉప్పెన సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు బుచ్చిబాబు సాన. డెబ్యూ మూవీనే మంచి విజయం సాధించడంతో బుచ్చిబాబు పై టాలీవుడ్ దృష్టిపడింది. 100% థియేట్రికల్ అక్యూపెన్సీతో ఉప్పెన సినిమా విడుదలై మాంచి వసూళ్లు కూడా రాబట్టింది. అప్పటినుండి బుచ్చిబాబు టాలీవుడ్ వార్తల్లో హాట్ టాపిక్ అవుతున్నాడు. తెలుగు ప్రేక్షకులు కూడా బుచ్చిబాబు కొత్త ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఇదివరకే బుచ్చిబాబు పలు ఇంటర్వ్యూలలో ఓ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి పదేపదే ప్రస్తావించాడు. అయితే.. తాను ‘నాన్నకు ప్రేమతో’ మూవీ టైంలో ఎన్టీఆర్ కి ఓ స్టోరీ లైన్ వినిపించడం జరిగిందని, ఆ లైన్ కూడా ఎన్టీఆర్ కి బాగా నచ్చిందని చెప్పాడు. అలాగే ఆ కథ తన దగ్గర రెడీగా ఉందని కూడా బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చాడు. మరి నిజంగానే ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని అనుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ RRR తర్వాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలను లైనప్ చేశాడు.ఇక ఎన్టీఆర్ తో బుచ్చిబాబు సినిమా పై క్లారిటీ లేకుండా పోయింది. తాజాగా బుచ్చిబాబు మరో స్టార్ హీరో అల్లు అర్జున్ కి కథ వినిపించినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. బన్నీకి బుచ్చిబాబు ఓ లవ్ స్టోరీ వినిపించాడని, ఇంకా ఆ కథ పై బన్నీ సైడ్ నుండి క్లారిటీ రాలేదని కథనాలు చెబుతున్నాయి. మరి డైరెక్టర్ సుకుమార్ ప్రియశిష్యుడిగా బుచ్చిబాబు సానా ఏ హీరోతో తదుపరి సినిమా ప్రకటిస్తాడో చూడాలి. ఉప్పెన వచ్చి కూడా ఏడాది పూర్తవుతోంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాతో పాటు దర్శకులు వేణు శ్రీరామ్, కొరటాల శివ, బోయపాటి, అట్లీలతో సినిమాలు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇన్ని సినిమాలు లైనప్ చేసినప్పుడు బుచ్చిబాబు సినిమా ఎప్పుడు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి డైరెక్టర్ బుచ్చిబాబు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.