సాధారణంగా సినీతారల పేర్లు.. ఫ్యాన్స్ ఏర్పాటుచేసే ట్రస్టులు, షాపింగ్ మాల్స్, ఇంకా ఏవైనా కమర్షియల్ విషయాల్లో ఎక్కువగా వినిపిస్తుంటాయి. కానీ అప్పుడప్పుడు అడవి మృగాలను కూడా దత్తత తీసుకొని వాటికి సినిమా హీరోలు, హీరోయిన్ల పేర్లు పెడుతుంటారు. ‘హ్యూమన్ ఆఫ్ హైదరాబాద్’ వ్యవస్థాపకురాలు తుమ్మల రచనా చౌదరి.. గతంలో నెహ్రూ జూలాజికల్ పార్క్‌ని సందర్శించి ఓ ఏడాదిపాటు దత్తత తీసుకున్న రాయల్ బెంగాల్ టైగర్ కి “సూర్య” అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత 2020లో గాల్వాన్ వార్ లో ప్రాణాలు విడిచిన కల్నల్ సంతోష్ బాబు పేరు కూడా పెట్టారు. తాజాగా ఈ లిస్టులోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు వచ్చి చేరినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ లో ఉన్న వైల్డ్ యానిమల్ బెంగాల్ టైగర్ ని ‘హ్యూమన్ ఆఫ్ హైదరాబాద్’ వ్యవస్థాపకురాలు తుమ్మల రచనా చౌదరి దత్తత తీసుకుని “ప్రభాస్” అనే పేరు ఖరారు చేశారు.
A Royal Bengal Tiger named as #Prabhas at Nehru Zoological Park Hyderabad 🔥🔥 pic.twitter.com/bTcjOBkTFy
— Uppalapati Sai KaRRRthik (@karthiksai9999) April 30, 2022
ప్రస్తుతం రాయల్ బెంగాల్ టైగర్ కి ప్రభాస్ పేరు పెట్టిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే.. ప్రతి ఏడాది టైగర్ కి ఒక్కో పేరు మారుతుంటుంది కాబట్టి.. ప్రభాస్ పేరు కూడా ఒక ఏడాదికే పరిమితం కానుంది. ఇక ప్రభాస్ పేరు 2021 సెప్టెంబర్ నుండి 2022 ఆగష్టు వరకు టైగర్ కి కంటిన్యూ అవుతుంది. ఇదిలా ఉండగా.. రాయల్ బెంగాల్ టైగర్ కి డార్లింగ్ ప్రభాస్ పేరు పెట్టేసరికి.. అభిమాన హీరోకి అరుదైన గౌరవం దక్కిందంటూ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెరీర్ పరంగా ప్రభాస్ ప్రస్తుతం.. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ సినిమాలు చేస్తున్నాడు. మరి రాయల్ బెంగాల్ టైగర్ కి ప్రభాస్ పేరును పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Baahubali & Prabhas named tigers 😎#Orissa #Hyderabad #Prabhas21 pic.twitter.com/FhupeBZI0g
— Harish Kolasani (@harishkolasani2) July 18, 2020