Regina: టాలీవుడ్ లో హీరోయిన్ గా డెబ్యూ చేసి మంచి హిట్స్ ఖాతాలో వేసుకున్న చెన్నై భామ రెజీనా కసాండ్రా. తెలుగులో యంగ్ హీరోలందరి సరసన సినిమాలు చేసిన రెజినా.. స్టార్ హీరోయిన్స్ జాబితాలో మాత్రం చేరలేకపోయింది. ఇక కొంతకాలంగా సరైన హిట్ కోసం ట్రై చేస్తున్న రెజీనా.. ఇటీవలే మెగాస్టార్ సరసన స్పెషల్ సాంగ్ లో ఆడిపాడి, ఇప్పుడు ఓటిటి వెబ్ సిరీస్ ‘అన్యాస్ ట్యుటోరియల్’ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ‘అన్యాస్ ట్యుటోరియల్’ సిరీస్ ప్రసారమవుతోంది. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా.. ప్రముఖ కమెడియన్ ఆలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘ఆలీతో సరదాగా’ టీవీ షోలో పాల్గొంది. ఓ టాక్ షోలో రెజినా కెరీర్ తో పాటు పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఈ క్రమంలో.. చిన్నప్పుడే స్కూల్ లో యాంకరింగ్ చేసేదాన్ని. క్లాస్ లీడర్ గా ఉన్నప్పుడైతే ఏకంగా అబ్బాయిలను కొట్టేదాన్ని అని చెప్పింది.
చాలామంది తనను డామినేటింగ్ అనుకుంటారని, కానీ.. తన ఫిజిక్ చూసి అందరూ డామినేటింగ్ అనుకుంటున్నారని చెప్పుకొచ్చింది. కెరీర్ విషయానికి వస్తే.. తనకు పాత్ర నచ్చితే ఏదైనా చేస్తానని చెప్పింది. 2019లో కులుమనాలీలోని ఓ హోటల్లో ఐ మాస్క్ పెట్టుకుని నిద్రపోతున్నప్పుడు ఎవరో నుదురిని తాకినట్లు అనిపించిందని, మాస్క్ తీసేసి చూస్తే అక్కడ ఎవరూ లేరంటూ తాను భయపడిన సంఘటనను గుర్తుచేసుకుంది. ప్రస్తుతం రెజినా మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి రెజినా మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.