దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన అలాయ్ బలాయ్ వేడుక.. వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవిని ఉద్దేశించి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు.. చేసిన వ్యాఖ్యలు ఎంతటి వివాదాన్ని రాజేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గరికపాటి వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ వివాదంపై వివాదాలకు కెరాఫ్ అడ్రెస్ అయిన రామ్ గోపాల్ వర్మ స్పందించారు. చిరంజీవి ఏనుగు.. నువ్వు గరిక.. నీకు పద్మ అవార్డు కూడా ఎక్కువే అంటూ గరికపాటిని ఉద్దేశించి ఆర్జీవీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్లు వైరలవుతున్నాయి.
ఈ సందర్భంగా ఆర్జీవీ నాగబాబు చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసి.. ‘‘ఐ యాం సారీ నాగబాబు గారు.. మెగాస్టార్ ని అవమానించిన గుర్రం పాటిని క్షమించే ప్రసక్తే లేదు.. మా అభిమానుల దృష్టిలో చిరంజీవిని అవమానించిన వాడు మాకు గ(డ్డిప)రక తో సమానం, తగ్గేదేలే…’, ‘హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. మెగాస్టార్ చిరంజీవి ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో’’ అంటూ ఎద్దేవా చేశారు.
ఐ యాం సారీ @NagaBabuOffi గారు.. మెగాస్టార్ ని అవమానించిన గుర్రం పాటిని క్షమించే ప్రసక్తే లేదు.. మా అభిమానుల దృష్టిలో @KChiruTweets ని అవమానించిన వాడు మాకు గ(డ్డిప)రక తో సమానం, *త్తగ్గేదెలె…* 😡😡😡💪💪💪 https://t.co/hyJ8ORvA6N
— Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022
హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. మెగాస్టార్ @KChiruTweets ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో
— Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022
‘‘హే గూగురుపాటి నరసింహ రావు , తమరు గ(డ్డిప)రిక అయితే మా చిరంజీవి నరసింహ.. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి .’ ‘సర్ నాగబాబు గారు, ఆ గడ్డికి పద్మ కూడ ఎక్కువే, అలాంటప్పుడు పద్మశ్రీని ఎందుకు ఇచ్చారు సర్’’ అని ప్రశ్నించాడు ఆర్జీవీ.
హే గూగురుపాటి నరసింహ రావు , తమరు గ(డ్డిప)రిక అయితే మా @KChiruTweets నరసింహ.. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి 😡😡😡😌😌😌
— Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022
‘సర్ నాగబాబు గారు, మీ అన్నయ్యని, ఆ గడ్డి అన్న మాటలకి , దాన్ని తినెయ్యకుండ వదిలెయ్యడం మీ సంస్కారం.. కాని అభిమానులమైన మేము ఆ గ(డ్డిప)రిక ని మంటలలో మండించకపోతే ఆ గడ్డి నమ్మే అమ్మవారు కూడ మమ్మల్ని క్షమించరు’’ అన్నాడు.
సర్ @NagaBabuOffl గారు, మీ అన్నయ్యని, ఆ గడ్డి అన్న మాటలకి , దాన్ని తినెయ్యకుండ వదిలెయ్యడం మీ సంస్కారం.. కాని అభిమానులమైన మేము ఆ గ(డ్డిప)రిక ని మంటలలో మండించకపోతే ఆ గడ్డి నమ్మే అమ్మవారు కూడ మమ్మల్ని క్షమించరు 🙏🙏
— Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022
‘‘సర్ నాగబాబుగారు, ఆ గడ్డికి పద్మ కూడ ఎక్కువే, అలాంటప్పుడు పద్మశ్రీ ని ఎందుకు ఇచ్చారు సర్’’ అంటూ ఆర్జీవీ వరుస ట్వీట్లు చేశాడు
సర్ @NagaBabuOffl గారు, ఆ గడ్డికి పద్మ కూడ ఎక్కువే, అలాంటప్పుడు పద్మశ్రీ ని ఎందుకు ఇచ్చారు సర్ .. సర్ సర్ సర్ @KChiruTweets ????
— Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022