లేడీ సూపర్ స్టార్ నయనతార.. జీవితంలో ఎంతో విలువైన, ఆనంద క్షణాలను గడుపుతోంది. నయనతార కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం, ఈ ఏడాది డైరకెట్ర్ విఘ్నేశ్‌ని ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సినిమాలు చేస్తూనే.. హనీమూన్ ట్రిప్పులకు వెళ్తూ జీవితాన్ని ఆశ్వాదిస్తున్నారు. అయితే తాజాగా నయన్- విఘ్నేశ్ తమ అభిమానులకు ఓ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా కవలల పిక్స్ పెట్టి.. మేం తల్లిదండ్రులు అయ్యాం అంటూ చెప్పారు. కాసేపు అభిమానులకు ఏమీ అర్థం కాలేదు. కానీ, కాసేపటికి తేరుకుని అసలు విషయం అర్థం చేసుకున్నారు. అంటే వీళ్లు సరోగసీ ద్వారా పిల్లలను కన్నారు అని గ్రహించారు. వారికి ఉయిర్, ఉలగం అని పేర్లు కూడా పెట్టారు. ఫ్యాన్స్ అంతా నయన్- విఘ్నేశ్ చెప్పిన వార్తతో ఫుల్ ఖుషీగా ఉన్నారు.
అయితే వీళ్ల సరోగసి అంశం సినిమా ఇండస్ట్రీలో పెద్ద చర్చకు తెర లేపింది. అంతా నయన్- విఘ్నేశ్ సరోగసీ ద్వారానే పిల్లల్ని కన్నారని భావిస్తున్నారు. అంతేకాకుండా ఆంగ్ర మీడియా కూడా నయనతార సరోగసి ద్వారా తల్లి అయ్యిందనే వార్తలు ప్రచురించారు. ఇదే అంశంపై సీనియర్ హీరోయిన్, సీరియల్ ఆర్టిస్ట్ కస్తూరి సైతం పరోక్షంగా స్పందించింది. నయన్- విఘ్నేశ్ ప్రకటన తర్వాత కస్తూరి ఓ ట్వీట్ చేసింది. అదేంటంటే.. ఇండియాలో సరోగసీని బ్యాన్ చేశారు. 2022 జనవరి నుంచి భారత్ సరోగసీ విధానంపై నిషేదం విధించారని చెప్పారు. ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్థితుల్లోనే ఈ విధానాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ అంశంపై మనం చాలా వార్తలు వినబోతున్నాం అంటూ కామెంట్ కూడా చేశారు. కస్తూరి నయన్- విఘ్నేశ్‌లను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేసిందని భావిస్తున్నారు.
ఇప్పుడు ఈ అంశం మరింత వైరల్‌గా మారింది. ఇప్పుడు నయన్- విఘ్నేశ్ శివన్ ల కవల పిల్లల అంశం వివాదంగా కూడా మారింది. వీరి పిల్లల విషయంలో తమిళనాడు ప్రభుత్వం జోక్యం చేసుకుంది. తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి నయన్- విఘ్నేశ్‌ల కవలల విషయంపై స్పందించారు. సరోగసీకి సంబంధించిన సమాచారం, వివరాలు తమకు సమర్పించాలని ఆదేశించారు. 2021 డిసెంబర్‌లో కమర్షియల్ సరోగసీపై ఆంక్షలు తెచ్చిన విషయం తెలిసిందే. అవి జనవరి 25, 2022 నుంచి అమలులోకి వచ్చాయి. అంటే ఆ తర్వాత నుంచి కమర్షియల్ సరోగసీపై దేశంలో నిషేదం ఉంది. ఆ తర్వాత డబ్బు చెల్లించి సరోగసీ ద్వారా పిల్లల్ని పొందే అవకాశం లేదు. కొత్త నిబంధనల ప్రకారం సరోగసీకి సిద్ధమైన వ్యక్తి కూడా రక్త సంబంధీకులు అయి ఉండాలనే చట్టం కూడా ఉంది. మరి.. నయనతార- విఘ్నేశ్‌లు ఎప్పుడు సరోగసీకి వైద్యులను సంప్రదించారు. వీళ్లు ఏ ప్రకారం ఈ పిల్లలను పొందారు అనే అంశాలపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. అందుకే తమిళనాడు ప్రభుత్వం సైతం వివరణ కోరినట్లు తెలుస్తోంది.