సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని భాషల్లో గొప్ప విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో పుష్ప-2 మూవీపై అంచానాలు భారీగా పెరిగాయి. కేవలం సౌత్ ప్రేక్షకులు మాత్రమే కాక అన్ని భాషల వాళ్లు.. ఈ చిత్రం పార్ట్-2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప ది రూల్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పుష్ప పార్ట్ 1ని మించేలా ఈ పార్ట్ 2 ఉండనుంది అంటున్నారు మేకర్స్.
ఈ క్రమంలో పుష్ప-2 సినిమాలో నటించేందుకు కొత్త నటీనటులకు మూవీ మేకర్స్ అద్భుత అవకాశం కల్పిస్తున్నారు. ఈ సినిమా అడిషన్స్ తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని వయసుల వారికి మూవీలో నటించే అవకాశం ఉందని చెప్పారు. ఈ నెల 3,4,5 తేదీల్లో అడిషన్స్ జరుగుతాయన్నారు. తిరుపతిలో న్యూ బాలజీ నగర్‌లోని మేక్ మై బేబీ జీనియస్ స్కూల్‌లో నటీనటుల ఎంపిక ఉంటుందన్నారు.
ఇది కూడా చదవండి: Vishnu Priya: విష్ణుప్రియ సూపర్ క్యూట్ డాన్స్ మూవ్స్.. వీడియో వైరల్!
ఆసక్తి ఉన్న వారు ఆయా తేదీల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య అడిషన్స్‌కు హాజరుకావాలని సూచించారు. అయితే చిత్తూరు యాస కచ్చితంగా రావాలన్నారు. మీలో నటించే ఆసక్తి ఉంటే మీరు కూడా అదృష్టాన్ని పరీక్షించుకోండి. అల్లు అర్జున్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేయండి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Ram Charan: రామ్ చరణ్ ను కలిసేందుకు ఓ వీరాభిమాని.. బళ్లారి నుంచి హైదరాబాద్ కి ప్రయాణం!
Let’s go 😊#PushpaTheRule#ThaggedheLe pic.twitter.com/LdEePnquM6
— Pushpa (@PushpaMovie) July 1, 2022