సినిమా పరిశ్రమలో తరచుగా వినబడే మాట కాస్టింగ్ కౌచ్. నటి కావాలనుకున్నవారు, హీరోయిన్లుగా రాణించాలంటే దర్శక, నిర్మాతలు చెప్పిన ప్రకారం ఎక్కడకు రమ్మంటే అక్కడకు వెళ్లాలని చాలా మంది ఆరోపణలు చేశారు.
సినిమా పరిశ్రమలో తరచుగా వినబడే మాట కాస్టింగ్ కౌచ్. నటి కావాలనుకున్నవారు, హీరోయిన్లుగా రాణించాలంటే దర్శక, నిర్మాతలు చెప్పిన ప్రకారం ఎక్కడకు రమ్మంటే అక్కడకు వెళ్లాలని, ఏదీ చేయమంటే అది చేయాలని చాలా మంది ఆరోపణలు చేశారు. అప్పుడే సినిమా అవకాశాలు ఉంటాయని, చిత్ర పరిశ్రమలో మనుగడ సాగించాలంటే తాము చెప్పినట్లు చేయాల్సిందేనని వారు ఇబ్బందులకు గురి చేస్తారంటూ పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలు అనేక మంది హీరో హీరోయిన్లు కొట్టిపారేస్తున్నారు. తమకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదు అంటూనే.. ప్రతి ఇండస్ట్రీలోనూ ఇటువంటివి ఉంటాయని, అయితే వినోద రంగంలోవి మాత్రమే బయటకు వస్తాయంటూ చెబుతున్నారు. ఏదీ ఏమైనప్పటికీ.. ఇటువంటి అనుభవాలను ఎదుర్కొంటున్నారు పలువురు నటీమణులు.
తమిళ బుల్లి తెర నటికి ఇటువంటి చేదు అనుభవం ఎదురైంది. యూట్యూబర్ స్థాయి నుండి బుల్లి తెర హోస్ట్ గా మారింది వీజే దీపిక. ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రముఖ సీరియల్ పాండియన్ స్టోర్స్‌లో ఐశ్వర్య పాత్రను పోషిస్తున్న దీపిక ఇటీవల తనకు ఎదురైన చేదు సంఘటన గురించి వెల్లడించింది. ‘రాఘవ లారెన్స్ రాబోయే చిత్రంలో అతడి చెల్లెలి పాత్ర కోసం ఆడిషన్ కు వెళ్లాను. అందులో దాదాపుగా సెలెక్ట్ అయిపోయాను అనుకున్నాను అయితే దర్శకుడు ఈ సినిమాలో ఓ ముద్దు సీన్ ఉందని, ఆడిషన్ సమయంలో ఆ సీన్ చేసి చూపెట్టమని కోరడంతో షాక్ గురయ్యాను. నేను చేయనని చెప్పాను. అయినప్పటికీ దర్శకుడు వదలకుండా ముద్దు సీన్ రిహార్సల్ కింద చేసి చూపించమనే సరికి.. తిరస్కరించి వచ్చేశాను’అంటూ చెప్పుకొచ్చారు. తనను మానిప్యులేట్ చేసేందుకు దర్శకుడు పన్నిన వ్యూహం తనను ఎంతో బాధించిందని తెలిపింది.