అందమైన జీవితం, బంగారం లాంటి పిల్లలు ఉన్నా.. ఆర్థిక ఇబ్బందులతో చితికిపోతున్న సంసారాలు ఎన్నో. చాలీ చాలని జీతంతో కుటుంబాన్ని పోషించలేక, పిల్లల్ని పెద్ద బడుల్లో చదివించలేక ఎంతో మదనపడుతుంటారు తల్లిదండ్రులు.
అందమైన జీవితం, బంగారం లాంటి పిల్లలు ఉన్నా.. ఆర్థిక ఇబ్బందులతో చితికిపోతున్న సంసారాలు ఎన్నో. చాలీ చాలని జీతంతో కుటుంబాన్ని పోషించలేక, పిల్లల్ని పెద్ద బడుల్లో చదివించలేక ఎంతో మదనపడుతుంటారు తల్లిదండ్రులు. పిల్లలకు మంచి చదువులు, కోరినవన్నీ కొనివ్వాలని ఆశ ఉంటుంది. భార్యకు కనీసం పుట్టిన రోజుకు, పెళ్లి రోజుకే బంగారపు వస్తువులు లేదా పట్టు చీర వంటి కొనియాలన్న ఆశ భర్తకు ఉంటుంది. అయితే తన ఆర్థిక పరిస్థితి సరిపోక కిమ్మనకుండా సంసారాన్ని సాగిస్తాడు. అయితే అవసరాల కోసం అప్పులు చేస్తాడు. వీటిని తీర్చలేక సతమతమౌతుంటాడు. దీని వల్ల భార్యా భర్తల మధ్య గొడవలు జరిగి, మనస్పర్థలు ఎక్కువయ్యి.. చివరకు ప్రాణాలను తీసుకుంటున్నారు.
మహేశ్వరి విషయంలో కూడా ఇదే జరిగింది. అప్పులు, ఆర్థిక ఇబ్బందులు వెరసి ఆమెను ఆత్మహత్యకు పురిగొల్పాయి. అయితే చనిపోయేముందు భర్తకు ఫోన్ చేసి.. ఎక్కడెక్కడ ఏమేమీ పెట్టిందో చెప్పి కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ మండలం, కలవపాడు గ్రామ శివారులో జరిగింది. భర్త తెలిపిన వివరాల ప్రకారం.. డక్కిలి మండలం, ఎగువ లింగ సముద్రం గ్రామానికి చెందిన మహేశ్వరి, భర్త తిరుపాలయ్య భార్యా భర్తలు. వీరికి పవన్ , కార్తీక్ అనే కొడుకులు ఉన్నారు. వీరు వెంకటగిరిలోని రాణిపేటలో ఉంటున్నారు. అయితే మంగళవారం ఉదయం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో కాళ్లకు ఉన్న పట్టీలు తీసి, ఇంట్లో పెట్టి, పర్సు తీసుకుని రాపూరుకు వెళ్లు బస్సు ఎక్కింది.
డక్కిలి మండలం పలుగోడుకు టికెట్ తీసుకుంది. కానీ కలపాడు తెలుగు గంగ కాలువ వద్దకు వచ్చేసరికి మహేశ్వరి బస్సు దిగి.. గ్రామానికి వెళ్లే కట్టమీదుగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఆమె ఇంట్లో లేకపోవడాన్ని భర్త చూసి ఆమెకు ఫోన్ చేశాడు. తొలుత ఆమె ఎత్తలేదు. అయితే తిరిగి భర్తకు ఫోన్ చేసి.. వంట గదిలో డబ్బాల కింద రూ. 1700 పెట్టానని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని పేర్కొంది. కంగారు పడ్డ భర్త.. గట్టిగా అడిగే సరికి కలపాడు వద్ద తెలుగు గంగ కాలువలోకి దూకి చనిపోతున్నట్లు చెప్పి ఫోన్ పెట్టింది. ఫోన్ చేసినా తిరిగి తీయలేదు. అనంతరం కాలువలోకి దూకేసింది. ఆమె చెప్పిన ఆధారాలను బట్టి అక్కడకు వెళ్లేసరికి పర్సు గట్టుమీద కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.