జబర్దస్త్ కామెడీ షో – ఏడేళ్ల కింద 2013 ఫిబ్రవరిలో మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతుంది జబర్దస్త్. ఇప్పటికే 350 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని 400 ఎపిసోడ్స్ వైపు పరుగులు తీస్తుంది జబర్దస్త్. ఈ షో సక్సెస్ అయిన తీరు చూసి మరో రోజు కూడా పెంచింది మల్లెమాల టీం. ఎక్స్ ట్రా యాడ్ చేసి జబర్దస్త్‌కు డబుల్ డోస్ ఇచ్చారు. అలా మొదలు పెట్టిన ఎక్స్ ట్రా జబర్దస్త్ కూడా దుమ్ము దులిపేస్తుంది. జబర్దస్త్‌తో పోలిస్తే ఎక్స్ ట్రా మరింత ఎక్స్ ట్రా రేటింగ్ కూడా తీసుకొస్తోంది. మరోవైపు ఎన్ని షోలు వచ్చినా కూడా జబర్దస్త్‌కు పోటీగా నిలబడలేక పోయాయి. సుధీర్, శ్రీను, నరేశ్ తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకులకు నవ్వాగదు. సుధీర్, శ్రీను, నరేశ్ తమకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అయితే ఇదంతా అంత తేలికగా సాధ్యంకాలేదు. గతంలో ఎన్నో… ఎన్నెన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. లైఫ్ జర్నీ స్కిట్ లో నరేశ్ పడ్డ కష్టాలు పగవాడికి కూడా రాకూడదనే విధంగా చెప్పడం కంటనీరు తెప్పిస్తుంది.
సుధీర్, శ్రీను, నరేశ్ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. నీళ్లతోనే కడుపు నింపుకున్నారు. తెర వెనక వీళ్లు పడిన ’ ఆ కష్టాల్ని కార్తీక్, ఇమ్మాన్యుయేల్, నూకరాజు ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌వేదికగా తెరపైకి తీసుకొచ్చారు. ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ 350వ ఎపిసోడ్‌కి చేరుకుంది. సెప్టెంబరు 3న ఈ ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. ఓ వైపు ఆనందం, అల్లరి – మరోవైపు కంటతడి పెట్టించే సన్నివేశాలు జబర్దస్త్ గా ఈ ప్రోమోలో ఉన్నాయి. రాకింగ్ రాకేశ్, రోహిణి భార్యభర్తలుగా నవ్వులు పంచగా, జగదేక వీరుడు- అతిలోక సుందరిలా రామ్ ప్రసాద్- శ్రీను, అమ్రిష్ పురిలా సుధీర్ దర్శనమిచ్చి ఆకట్టుకున్నారు.
అంతేకాదు, సుధీర్ కి సరిజోడి రష్మి ని కూడా ఎక్స్ పీరీయన్స్ ని షేర్ చేయమని కార్తీక్ కోరడంతో ఆమె కన్నీళ్ళ పర్యంతమైంది. ప్రోమో చూసాక ప్రతీ ప్రేక్షకుడికి ఎక్స్ ట్రా జబర్దస్త్ బొమ్మ దద్దరిల్లిపోతుందని గట్టి నమ్మకం ఏర్పడేలా మల్లెమాల టీం కష్టపడినట్లు అర్ధమవుతుంది.